Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్‌ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ అప్‌డేట్ లీక్‌

By:  Tupaki Desk   |   27 Oct 2021 4:15 AM GMT
సూపర్ స్టార్‌ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ అప్‌డేట్ లీక్‌
X
తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన అన్నాత్తే సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాలో నయనతార.. కీర్తి సురేష్‌ ఇంకా మీనా మరియు షుఖ్బులు ఉన్నారు. ఈ సినిమా రజినీకాంత్ అభిమానులకు ఫుల్ మీల్స్ అంటూ యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. తమిళంలో అన్నాత్తే అంటూ విడుదల అవుతున్న ఈ సినిమాను తెలుగు లో పెద్దన్న అంటూ విడుదల చేస్తున్నారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ మూవీగా ఈ సినిమా నిలుస్తుందనే నమ్మకంతో అంతా ఉన్నారు. ఈ సినిమా ను అన్ని ఏరియాలకు కూడా భారీ మొత్తంలో బయ్యర్లు కొనుగోలు చేయడం జరిగింది. రజినీకాంత్‌ ఈమద్య కాలంతో తెలుగు లో పెద్దగా ప్రభావం చూపించలేక పోయాడు. అయినా కూడా పెదన్నకు పెద్ద మొత్తంను పెట్టారనే వార్తలు ఆమద్య వచ్చాయి.

రజినీకాంత్ సినిమా అనగానే జనాలు మొదటి రెండు వారాలు థియేటర్ల వద్ద బారులు తీరడం చాలా కామన్‌ విషయం. ముఖ్యంగా తమిళనాడులో భారీగా రజినీకాంత్‌ సినిమాలు చూస్తారు. ఫలితంతో సంబంధం లేకుండా ఖచ్చితంగా చూసే అభిమానులు ఆయనకు కోట్లల్లో ఉన్నారు అనడంలో సందేహం లేదు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను కూడా అక్కడ భారీగానే చూస్తారనే నమ్మకం అందరిలో ఉంది. కాని కరోనా భయం ఇంకా కూడా ఉంది కనుక థియేటర్ల వద్ద జనాలు గతంలో మాదిరిగా ఉంటారనే నమ్మకం మాత్రం చాలా మందికి లేదు. అభిమానులు మొదటి వారంలో చూస్తారేమో కాని ఆ తర్వాత చూడాలనుకునే వారు అంతా కూడా ఓటీటీ లో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని చూసే వారే. ఓటీటీ స్ట్రీమింగ్‌ ఆలస్యం అవుతుంది అనుకుంటే థియేటర్‌ కు వెళ్లి చూస్తారు. కాని రజినీకాంత్‌ అన్నాత్తే సినిమా స్ట్రీమింగ్‌ కు సంబంధించిన విషయం అప్పుడే లీక్‌ అవ్వడంతో ఖచ్చితంగా కలెక్షన్స్ పై ప్రభావం ఉంటుందనే టాక్‌ మొదలు అయ్యింది.

తమిళ మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం అన్నాత్తే సినిమాను ఇప్పటికే థియేటర్‌ రిలీజ్ తర్వాత స్ట్రీమింగ్‌ చేయడం కోసం నెట్‌ ఫ్లిక్స్ వారు రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగింది. తమిళం మరియు తెలుగు వర్షన్ ల రైట్స్ ను భారీ మొత్తంకు నెట్‌ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేయడం జరిగిందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా థియేటర్‌ లో విడుదల అయిన మూడు వారాల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కు నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈమద్య కాలంలో మొదటి రెండు వారాల్లోనే సినిమా ల వసూళ్లు నీరసించి పోతున్నాయి. కనుక మూడవ వారం తర్వాత వసూళ్లు నమోదు అవుతాయి అనేది అతి నమ్మకం. కనుక మూడు వారాల్లోనే స్ట్రీమింగ్‌ కోసం నెట్ ఫ్లిక్స్ వారికి సినిమాను అమ్మేశారు అంటున్నారు.

మూడు వారాల్లోనే స్ట్రీమింగ్‌ కాబట్టి న్యూట్రల్‌ ఆ ఉండే చాలా మంది ప్రేక్షకులు సినిమాను స్ట్రీమింగ్‌ చేద్దామనే చూస్తారు. ఎందుకంటే సినిమాను థియేటర్‌ కు వెళ్లి చూడాలంటే మినిమంగా 200 రూపాయలు అవుతుంది.. ఒక ఫ్యామిలీ వెళ్లాలి అంటే ఇక వెయ్యి రూపాయల వరకు ఉండాల్సిందే. అందుకే స్ట్రీమింగ్‌ చేయడం బెటర్ అని కొందరు అనుకుంటారు. అందుకే ఇప్పుడు అన్నాత్తే స్ట్రీమింగ్‌ అప్ డేట్‌ లీక్ అవ్వడం వల్ల బయ్యర్లు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మూడు వారాల్లో స్ట్రీమింగ్‌ విషమై నిర్మాతలు స్పష్టతను ఇవ్వాల్సి ఉంది. మూడు వారాల్లో స్ట్రీమింగ్‌ ఉండదు అంటూ ప్రకటించకుంటే ఖచ్చితంగా కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.