Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్‌ మూవీ ఓటీటీ డీల్‌ రికార్డ్‌

By:  Tupaki Desk   |   15 Aug 2021 12:30 AM GMT
సూపర్ స్టార్‌ మూవీ ఓటీటీ డీల్‌ రికార్డ్‌
X
తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రూపొందుతున్న 'బెస్ట్‌' మూవీ షూటింగ్‌ ముగింపు దశకు వచ్చేసిందట. తమిళ మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ ను ఈ నెల చివరి వరకు లేదా వచ్చే నెలలో ముగించబోతున్నారు. విడుదల తేదీ పై కూడా గత కొన్నాళ్లుగా ఉన్న అనుమానాలకు చెక్ పెట్టబోతున్నారు. ఇక ఈ సినిమాను డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్ చేసే అవకాశం లేదని తమిళ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ ను చేస్తూనే మరో వైపు బెస్ట్‌ సినిమాకు సంబంధించిన బిజినెస్ కార్యక్రమాలు చేస్తున్నారు.

ఈమద్య కాలంలో విజయ్‌ ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తూనే ఉంది. అన్ని సినిమాలు కూడా వందల కోట్ల వసూళ్లు దక్కించుకుంటున్నాయి. కనుక ఈ సినిమా కూడా తప్పకుండా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. అందుకే బెస్ట్‌ సినిమాకు గాను అన్ని విధాలుగా బెస్ట్‌ బిజినెస్ అవుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ వారు భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేశారట. ఇప్పటి వరకు తమిళంలో ఏ సినిమాకు కూడా దక్కని ప్రైజ్‌ ను బెస్ట్‌ కు నెట్‌ ఫ్లిక్స్ వారు ఇవ్వబోతున్నారట. బడ్జెట్‌ లో దాదాపుగా సగంకు పైగా ఓటీటీ రైట్స్ ద్వారానే రికవరీ అయినట్లుగా తెలుస్తోంది.

విజయ్‌ ను ఈ సినిమాలో దర్శకుడు నెల్సన్ దిలీప్ చాలా విభిన్నంగా చూపించబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ను సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. తెలుగు డబ్బింగ్‌ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్మడు పోయిందని సమాచారం అందుతోంది. పూజా హెగ్డే ఉండటంతో పాటు సినిమాకు సంబంధించినంత వరకు విజయ్‌ అభిమానులు భారీగా హైప్ క్రియేట్‌ చేస్తున్నారు. అందుకే సినిమాకు భారీగా బిజినెస్ అవుతోంది. విజయ్ బెస్ట్‌ తర్వాత తెలుగు లో వంశీ పైడి పల్లి దర్శకత్వంలో సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే. దిల్‌ రాజు బ్యానర్‌ లో ఆ సినిమా నిర్మాణం జరుగబోతుంది.