Begin typing your search above and press return to search.
అల్లుడి దర్శకత్వంలో సూపర్ స్టార్ సినిమా..?
By: Tupaki Desk | 10 July 2021 1:01 PM ISTసూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ''అన్నాత్తే'' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రజినీ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశాడు. తలైవా కెరీర్ లో 168వ చిత్రంగా వస్తున్న 'అన్నాతే'.. దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దీని తర్వాత రజినీ చేయబోయే ప్రాజెక్ట్ ఎంటనేది ఇంత వరకు క్లారిటీ రాలేదు.
రజనీకాంత్ ఆ మధ్య రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించడంతో సినిమాలకు స్వస్తి పలకబోతున్నారని అభిమానులు భావించారు. అయితే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాల్లోకి రావడం లేదని సూపర్ స్టార్ ప్రకటించడంతో.. తదుపరి సినిమాలపై అందరిలో ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఓ తమిళ మీడియా కథనం ప్రకారం రజినీకాంత్ రెండు చిత్రాలకు కమిటయ్యారట. అందులో ఒకటి తన అల్లుడు, స్టార్ హీరో ధనుష్ దర్శకత్వంలో చేయనున్నారట.
హీరో ధనుష్ 'పవర్ పాండి' అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళ్ లో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో అతి త్వరలోనే దర్శకుడిగా రెండో చిత్రాన్ని ప్రారంభిస్తానని ధనుష్ ఇటీవల వెల్లడించారు. అయితే ఈ సినిమా రజినీకాంత్ తోనే ఉంటుందని అంటున్నారు. రజనీ కుమార్తెలు ఐశ్వర్య - సౌందర్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
అయితే ధనుష్ ప్రస్తుతం హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల 'జగమే తంత్రం' చిత్రంతో పలకరించిన స్టార్ హీరో.. 'అత్రాంగి రే' అనే హిందీ మూవీతో పాటుగా 'ది గ్రే మ్యాన్' అనే హాలీవుడ్ మూవీ షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం కార్తీక్ నరేన్ దర్శకత్వంలో '#D43' షూటింగ్ లో పాల్గొంటున్నాడు ధనుష్. ఇదే క్రమంలో తన అన్న సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'యుగానికొక్కడు 2'.. మిత్రన్ డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నాడు. ఇదే క్రమంలో శేఖర్ కమ్ముల తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు. వరుస సినిమాలను లైన్ లో పెట్టిన ధనుష్.. ఇప్పుడు వీలు చూసుకొని తన మామ రజినీ ని డైరెక్ట్ చేస్తాడో లేదో చూడాలి. ధనుష్ ఇంతకముందు రజినీ నటించిన 'కాలా' చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ఇకపోతే 'కనులు కనులను దోచాయంటే' ఫేమ్ దేషింగ్ పెరియసామి దర్శకత్వంలో రజినీకాంత్ ఓ సినిమా చేయనున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే దర్శకుడు దీనిపై స్పందిస్తూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి వస్తున్న వార్తలు నిజం కాదని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో రజినీ తో 'చంద్రముఖి 2' సినిమా చేయాలని దర్శకుడు పి. వాసు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. రజినీ వీరాభిమాని రాఘవ లారెన్స్ కూడా ఈ సీక్వెల్ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.
పి.వాసు - సూపర్ స్టార్ కాంబోలో రాబోయే 'చంద్రముఖి 2' సినిమాలో నటిస్తున్నానంటూ లారెన్స్ వెల్లడించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కాలానిథి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని పేర్కొన్నాడు. అయితే రజినీ ఏ సినిమా ముందు సెట్స్ పైకి తీసుకెళ్లాడు అనే దానిపై స్పష్టత లేదు. 'అన్నాత్తే' మూవీ విడుదలైన తర్వాత తలైవా తదుపరి సినిమా ఎంటనేది తెలిసే అవకాశం ఉంది. కాగా, 'అన్నాత్తే' షూటింగ్ ముగించిన తర్వాత రజినీ కాంత్ రొటీన్ హెల్త్ చెకప్ కోసం యూఎస్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఆయన అమెరికా నుంచి చెన్నైకి తిరిగి వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.