Begin typing your search above and press return to search.

ఓ తండ్రిగా గర్వపడుతున్నాను: సూపర్ స్టార్ మోహన్ లాల్

By:  Tupaki Desk   |   13 Feb 2021 4:00 PM IST
ఓ తండ్రిగా గర్వపడుతున్నాను: సూపర్ స్టార్ మోహన్ లాల్
X
సినీ ఇండస్ట్రీని బడా హీరోలు హీరోయిన్ల వారసులు ఏలుతున్న కాలమిది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అన్ని ఫ్యామిలీస్ నుండి టకటకా సినిమాలతో ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. కొడుకులైతే హీరోలుగా.. కూతుళ్లయితే హీరోయిన్స్ గా సీట్ కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. అయితే కొందరు మాత్రమే డిఫరెంట్ ప్రొఫెషన్ ఎంచుకుంటారు. వారిని చూస్తే మనం కూడా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ఫాదర్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అయ్యుండి వారసులున్నా కూడా సినిమాల్లోకి రాకపోయే సరికి పెద్ద ఎత్తున చర్చలు మొదలవుతాయి. ఇప్పుడు అలాంటి చర్చలలో నిలిచింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూతురు విస్మయ. ఏ తండ్రికి అయినా పిల్లలు గర్వపడే మూమెంట్ క్రియేట్ చేస్తే ఆ ఆనందం వేరేలా ఉంటుంది.

ప్రస్తుతం అలాంటి ఆనందంలో మునిగి తేలుతున్నాడు మోహన్ లాల్. కూతురు రచించిన మొదటి నవల త్వరలో విడుదల కాబోతుందట. గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్ పేరుతో విస్మయ రాసిన ఈ పుస్తకం ఇప్పుడు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఈ సందర్బంగా మోహన్ లాల్ తన కూతురు రాసిన పుస్తకాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసాడు.
అలాగే “ఫిబ్రవరి 14న తన కూతురు రాసిన బుక్ ‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్’ ప్రకటించినందుకు తండ్రిగా గర్వంగా ఉన్నట్లు తెలిపాడు. ఈ పుస్తకాన్ని ప్రచురించిన పెంగ్విన్ ఇండియా వారు కూడా విస్మయకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా.. మోహన్ లాల్ సినిమాల విషయానికి వస్తే.. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో నటించిన దృశ్యం-2 మూవీ ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ విడుదలకు సిద్ధం అవుతోంది.