Begin typing your search above and press return to search.

మహేష్ కొత్త సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చు!

By:  Tupaki Desk   |   22 May 2020 1:20 PM IST
మహేష్ కొత్త సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చు!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు వంటి భారీ హిట్ తర్వాత ఇంతవరకు ఏ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా ఖరారు అయిందని తెలిసిందే. తాజాగా డైరెక్టర్ పరశురామ్ మీడియాతో మాట్లాడుతూ.. తను మహేష్ తో చేయబోయే తదుపరి సినిమా గురించి కొన్ని విషయాలు బయట పెట్టాడు. అంతేకాదు స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయ్యాయని పేర్కొన్నాడు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ ఫ్రెష్ ఫేస్ సారా అలీ ఖాన్ నటించబోతుందని ఓ వార్త హల్ చల్ చేస్తుంది. అయితే సూపర్ స్టార్ పక్కన నటించే హీరోయిన్ గురించి పక్కన పెడితే.. ఇక ఈ సినిమా మంచి ఎంటర్టైనర్‌‌గా రానుందని తెలుస్తోంది. మహేష్ గత కొంతకాలంగా సందేశాత్మక కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు. ఆ పంథాకు పూర్తి భిన్నంగా పూర్తి స్థాయి రొమాంటిక్ ప్రేమకథతో ఈ సినిమా మంచి ఎంటర్టైనర్‌‌గా రానుందని సమాచారం.

ఇక ఈ సినిమాను తన తండ్రి కృష్ణ పుట్టిన రోజున అంటే మే 31న మొదలు పెట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంన్నాడు మహేష్. కానీ ఇప్పుడు తన జన్మదిన వేడుకలు రద్దు చేసుకున్నాడు సూపర్ స్టార్ కృష్ణ. అభిమానులు సైతం వేడుకలు నిర్వహించడం కానీ.. తనను కలవడం కానీ చేయవద్దని చెప్పాడట. అందుకు ప్రధాన కారణం.. ఆయన భార్య విజయ నిర్మల 2019 జూన్ 27న మరణించడం. దాంతో తొలి సంవత్సరీకం పూర్తి కాని నేపథ్యంలో సంతాప సూచకంగా కృష్ణ తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తండ్రి నిర్ణయాన్ని గౌరవించి మహేష్ తన సినిమాలకు సంబంధించిన ఎలాంటి వేడుకలు కూడా జరపొద్దని ఫిక్స్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే పరశురామ్ సినిమా ఓపెనింగ్ కూడా మే 31 రోజు కూడా ఉండకపోవచ్చని తెలుస్తుంది. ఈ వార్త అభిమానులకు చేదు వార్తే.. అయితే దర్శక నిర్మాతలు మాత్రం మహేష్ బాబుతో తాము చేయబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ మాత్రం అదే రోజు ఇస్తారని అన్నట్లు సమాచారం.