Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : మహేష్‌ బర్త్‌ డేకు ఫ్యాన్స్‌ సందడి షురూ

By:  Tupaki Desk   |   26 July 2020 8:30 AM GMT
ఫొటోటాక్‌ : మహేష్‌ బర్త్‌ డేకు ఫ్యాన్స్‌ సందడి షురూ
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు బర్త్‌ డేకు మరో 15 రోజులు మాత్రమే ఉంది. దాంతో మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్డింగ్‌ మొదలు పెట్టారు. ఇప్పటికే మహేష్‌ బాబు బర్త్‌ డే సందర్బంగా కామన్‌ డీపీ విడుదల చేశారు. ఒక వైపు ఛార్మినార్‌ మరో వైపు కర్నూలు కొండారెడ్డి బురుజు ఉండగా ఒక స్టార్‌ పిల్లర్‌ ను ఆనుకుని వైట్‌ అండ్‌ వైట్‌ సూట్‌ లో మహేష్‌ బాబు స్టైల్‌ గా నిల్చుని ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది.

ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్స్‌ కామన్‌ డీపీలు వచ్చాయి కాని ఇది చాలా ప్రత్యేకంగా ఉందంటూ ఫ్యాన్స్‌ అభిప్రాయ పడుతున్నారు. మహేష్‌ బాబు గత సూపర్‌ హిట్‌ చిత్రాల పాత్రలను కూడా చూడవచ్చు. మహేష్‌ బాబు బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ఈ పోస్టర్‌ చూస్తేనే అర్థం అయి పోతుంది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు స్టైలిష్‌ లుక్‌ మరియు భిన్నమైన బర్త్‌ డే పోస్టర్‌ తో ఫ్యాన్స్‌ మురిసి పోతున్నారు.

ఆగస్టు 9వ తారీకు వరకు ట్విట్టర్‌ మరియు ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్స్‌ మీద ఈ పోస్టర్‌ ట్రెండ్‌ చేయాలని ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున షేర్స్‌ చేస్తూ ఉన్నారు. ఇక మహేష్‌ బర్త్‌ డే రోజున సర్కారు వారి పాట చిత్రం నుండి సర్‌ ప్రైజ్‌ ఏమైనా ఉంటుందా అని కూడా ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని మహేష్‌ బాబు ప్రీ లుక్‌ ను ఇప్పటికే విడుదల చేశారు. షూటింగ్‌ ఇప్పటి వరకు ప్రారంభించని కారణంగా సినిమా ఫస్ట్‌ లుక్‌ విషయమై క్లారిటీ లేదు.