Begin typing your search above and press return to search.

రాధే ఎఫెక్ట్‌ తో టాలీవుడ్ వైపు చూస్తున్న సూపర్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   18 May 2021 5:30 AM GMT
రాధే ఎఫెక్ట్‌ తో టాలీవుడ్ వైపు చూస్తున్న సూపర్‌ స్టార్‌
X
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్ హీరోగా రూపొందిన రాధే సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లు పూర్తి స్థాయిలో రన్ అవ్వని కారణంగా జీ నెట్‌ వర్క్‌ ఓటీటీ లో కూడా ఈ సినిమా ను స్ట్రీమింగ్‌ చేశారు. వసూళ్ల విషయంలో రికార్డు బ్రేక్‌ చేసిన రాధే మూవీ ప్రేక్షకులను నిరాశ పర్చింది. ఏమాత్రం సంతృప్తికరంగా రాధే సినిమా లేదంటూ విమర్శలు వస్తున్నాయి. సల్మాన్‌ ఖాన్‌ మరీ ఇంత రెగ్యులర్‌ సినిమాను చేస్తాడని ఊహించలేదు అంటూ అభిమానులు మరియు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో సల్మాన్ ఖాన్‌ ఒక సూపర్‌ హిట్‌ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం యశ్‌ రాజ్‌ బ్యానర్‌ లో సల్మాన్ ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా ఎలా ఉంటుందో క్లారిటీ లేదు. ఈ సమయంలో సల్మాన్‌ ఒక పక్కా కమర్షియల్‌ మూవీ చేయాలనే ఉద్దేశ్యంతో టాలీవుడ్‌ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. చిన్నదైనా లేదా బడా చిత్రమైనా టాలీవుడ్ నుండి ఒక సినిమాను తీసుకుని హిందీ లో రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. టాలీవుడ్ లేదా కోలీవుడ్‌ లో ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల్లో బెస్ట్‌ కమర్షియల్ సినిమాల జాబితాను సల్మాన్ టీమ్‌ తయారు చేస్తున్నారట.

ఈ ఏడాదిలోనే సల్మాన్ ఖాన్‌ రీమేక్ పట్టాలెక్కించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. టాలీవుడ్‌ లో ఇటీవల కాలంలో సూపర్‌ హిట్‌ అయిన ఏదైనా సినిమా రీమేక్ లో సల్మాన్‌ నటించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్‌ వరుసగా నిరాశ పర్చుతూ వస్తున్నాడు. అందుకే రీమేక్ తో అయినా ప్రేక్షకులను సంతృప్తి పరచి సక్సెస్‌ ను దక్కించుకోవాలనే పట్టుదలతో సల్మాన్ ఖాన్‌ ఉన్నాడు. అతి త్వరలోనే ఒక సినిమాను ఎంపిక చేసుకుని రీమేక్ పనులు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. త్వరలోనే ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.