Begin typing your search above and press return to search.
డైరెక్టర్ అవతారమెత్తిన సూపర్ స్టార్
By: Tupaki Desk | 8 April 2020 2:40 PM ISTతెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే అగ్ర నటులలో సూపర్ స్టార్ కృష్ణ ఒక్కరు. కృష్ణ 1970లు - 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ పొంది సూపర్ స్టార్ గా ప్రఖ్యాతి పొందాడు. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964లో హీరోగా నటించిన తొలి సినిమా 'తేనెమనసులు' - మూడవ సినిమా 'గూఢచారి 116' సినిమాతో సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత ఏడాది పొడవునా హీరోగా నటిస్తూ సినీ చరిత్రలోనే ఒక ఏడాదిలో ఎక్కువ చిత్రాల్లో నటించిన హీరోగా రికార్డ్ సృష్టించాడు. ఆపైన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్ లో 350 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు. అంతేకాకుండా పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారని అందరికీ తెలిసిన విషయమే. వాటిలో 'సింహాసనం -మహేష్ బాబు నటించిన 'బాలచంద్రుడు' -'కొడుకు దిద్దిన కాపురం' -'ముగ్గురు కొడుకులు' వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన చరిత్ర కృష్ణది. అయితే ప్రస్తుతం సినిమాలు తగ్గించి విశ్రాంతి తీసుకుంటున్న సూపర్ స్టార్ కృష్ణ రెండున్నర దశాబ్దాల తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టబోతున్నారట.
సూపర్ స్టార్ కృష్ణ మనవడు - మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్ లో ఒక యూత్ ఫుల్ సినిమాతో పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా అమరరాజా మీడియా అండ్ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఒక సన్నివేశానికి సూపర్ స్టార్ కృష్ణ డైరెక్షన్ చేసాడట. వివరాల్లోకి వెళ్తే మనవడి సినిమా షూటింగ్ ఎలా జరుగుంటుందో చూడటానికి వెళ్లిన కృష్ణ ని ఆ సినిమా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఒక సీన్ కి దర్శకత్వం చేయమని సూపర్ స్టార్ ని కోరాడట. డైరెక్టర్ కోరిక మన్నించిన కృష్ణ డైరెక్టర్ గా మారాడట. రెండున్నర దశాబ్దాల తర్వాత మెగా ఫోన్ పట్టి తన కూతురి కొడుకైన అశోక్ ని డైరెక్ట్ చేసాడు. సూపర్ స్టార్ డైరెక్ట్ చేసిన ఆ సూపర్ సీన్ చూడాలంటే విడుదల అయ్యేదాకా ఆగాల్సిందే. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు సగం పూర్తయింది. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిపివేశారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా జగపతిబాటు, నరేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.