Begin typing your search above and press return to search.

గూఢచారికి 51 వచ్చాక 'స్పైడర్' వస్తోంది

By:  Tupaki Desk   |   11 Aug 2017 4:28 AM GMT
గూఢచారికి 51 వచ్చాక స్పైడర్ వస్తోంది
X
తెలుగు సినిమాను కొత్త ఒరవళ్లు తొక్కించిన వారిలో సూపర్ స్టార్ కృష్ణ కాస్త ముందే ఉన్నారు. ఎందుకంటే ఆయనకంటే సీనియర్లు ప్రయోగాలు చేయడానికి భయపడుతుంటే.. కృష్ణ మాత్రం కొన్ని డేరింగ్ స్టెప్పులు వేశారు. ముఖ్యంగా టెక్నికల్ గా అప్డేడ్ అవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే ఎన్నో రకాల టెక్నాలజీల తొలి ఆవిష్కరణ ఆయన సినిమాల్లోనే ఉంటుంది. అలాగే తొలిసారిగా డిటెక్టివ్ నుండి ఒక గూఢచారి జేమ్స్ బాండ్ వంటి కతను తెలుగు తెరపై చూపించింది కూడా ఆయనే.

1966 ఆగస్టు 11న రిలీజైంది ''గూఢచారి 116''. అప్పట్లో బాగా చదువుకున్న వారికీ.. పెద్ద పెద్ద సిటీల్లో 'జేమ్స్ బాండ్ 007'' వంటి సినిమాలు చూసినవారికి.. ఈ టైటిల్ ఏదో ప్యారడీలా అనిపించింది కాని.. ఇంకా ఇంగ్లీషులో బాండ్ సినిమా చూడనివారికి మాత్రం.. అదో డిఫరెంట్ అనుభూతి. అసలు దేశం కోసం పనిచేసే గూఢచారులు ఇలా ఉంటారా.. అంటూ జనాలు నోరెళ్లబెట్టారు. కృష్ణను పొగడని వారే లేరు. విచిత్రం ఏంటంటే.. ఈ సినిమా రిలీజైన సరిగ్గా 51 సంవత్సరాల తరువాత ఇప్పుడు కృష్ణ కొడుకు మహేష్‌ బాబు 'స్పైడర్' అంటూ వస్తున్నాడు. అప్పట్లో కృష్ణ అలాంటి సినిమాలు చేస్తూ సూపర్ స్టార్ స్టాటస్ సొంతం చేసుకుంటే.. ఇప్పుడు మహేష్‌ మాత్రం సూపర్ స్టార్ అయ్యాకనే అలాంటి సినిమాలు చేస్తున్నాడు.

సరిగ్గా మహేష్‌ తన తండ్రి గూఢచారి 50 ఏళ్ల పండగ జరుపుతూ ఈ ఫీట్ చేసుంటే బాగుండేది.. కాని ఇప్పుడు 51 సంవత్సరంలోకి వచ్చిన గూఢచారికి కొత్త రెక్కలు అందిస్తూ తన స్పైడర్ ను అందివ్వడం కూడా చాలా బాగుంది. ఫ్రమ్ గూఢచారి విత్ లవ్!!