Begin typing your search above and press return to search.
ఎన్టీయార్ క్రిష్ణల మధ్య మంటలు పెట్టిన చిత్రం...?
By: Tupaki Desk | 3 Jan 2022 8:00 AM ISTఎన్టీయార్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ గా మాస్ హీరోగా జోరు చూపిస్తున్న రోజులు అవి. ఆయన తరువాత తరం హీరోగా క్రిష్ణ వచ్చి అనతికాలంలోనే మాస్ హీరోగా నిలదొక్కుకున్నారు. ఎన్టీయార్ కంటే ఇరవై ఏళ్ళు చిన్న కావడం, యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా క్రిష్ణకు ఉండడంతో ఎపుడూ ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంటూ వచ్చేది. ఇక డెబ్బై దశకం వచ్చేనాటికి ఎన్టీయార్ ప్రాభవం మెల్లగా తగ్గుతున్న పరిస్థితి కూడా ఏర్పడింది.
ఒక దశలో ఎన్టీయార్ తండ్రి పాత్రలకు కూడా షిఫ్ట్ అయిన వాతావరణం ఉంది. బడిపంతులు, తాతమ్మ కల, చిన్న నాటి స్నేహితులు లాంటి సినిమాల్లో ఎన్టీయార్ మిడిల్ ఏజ్డ్ తో సహా వృద్ధ పాత్రలు వేశారు. ఒక విధంగా ఆ పీరియడ్ క్రిష్ణకు స్వర్ణ యుగంగా ఉండేది. ఆయన చేసిన సాహసాలకు కూడా జనాలు నీరాజనాలు పట్టేవారు.
ఆ టైమ్ లో క్రిష్ణ ఒక విధంగా దుస్సాహసమే చేశారనుకోవాలి. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు మూవీని ఆయన చాలా డేరింగ్ గా మొదలెట్టారు. ఆ మూవీలో హీరోయిన్ ఉండదు, రొమాన్స్ కి స్కోప్ ఉండదు, పూర్తిగా డ్రై సబ్జక్ట్. ఈ సినిమా నాటికి క్రిష్ణ వయసు మూడు పదులు మాత్రమే.
హాయిగా డ్యూయెట్లు పాడుకుంటూ కమర్షియల్ మూవీస్ చేయాల్సిన క్రిష్ణ ఇలాంటి సబ్జెక్ట్ ని ఎంచుకోవడం పట్ల అంతా ముక్కున వేలేసుకున్నారు. ఇక ఎన్టీయార్ అయితే క్రిష్ణని ఈ సినిమా తీయవద్దు అని చెప్పారట. దానికి కారణం ఎన్టీయార్ తాను ఈ సినిమా తీయాలనుకోవడమే. అయితే మంచి హిట్ వస్తే ఆ ఊపులో ఎన్టీయార్ సినిమా తీసి ఉండేవారు. కానీ ఈ లోగా క్రిష్ణ స్టార్ట్ చేసి ఫినిష్ చేశారు.
ఈ సినిమా కోసం ఫస్ట్ టైమ్ విశాఖ ఏజెన్సీకి కూడా టోటల్ యూనిట్ తో వచ్చి అనేక ఇబ్బందులను కూడా ఆయన ఫేస్ చేశారు. ఈ సినిమా షూటింగ్ సగంలో ఉండగానే డైరెక్టర్ వి రామచంద్రరావు చనిపోయారు. దాంతో మిగిలిన పార్ట్ ని క్రిష్ణ డైరెక్ట్ చేసి ఆయన పేరు వేశారు. అనేక ఆటంకాల తరువాత ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. చిత్రాన్ని 1974 మే 1స్ట్ న మేడే కానుకగా రిలీజ్ చేస్తే సూపర్ డూపర్ హిట్ అయింది.
ఈ సినిమా క్రిష్ణ తీసి రిలీజ్ చేయడంతో కొన్నాళ్ళ పాటు ఎన్టీయార్ క్రిష్ణల మధ్య విభేధాలు వచ్చాయని చెబుతారు. మాటలు కూడా లేని సీన్ ఉండేదట. ఎనిమిదేళ్ళకు అంటే 1982లో వయ్యారిభామలు వగలమారి భర్తలు మూవీలో ఇద్దరు కలసి నటించేదాకా ఆ గొడవలు అలాగే కొనసాగాయని అంటారు.
ఇదిలా ఉండగా అల్లూరి 125వ జయంతి హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి పాత్రధారి క్రిష్ణను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సత్కరించారు. తాను 350 సినిమాల్లో హీరోగా నటిస్తే తనకు నచ్చిన ఏకైక చిత్రం అల్లూరి అని క్రిష్ణ చెప్పుకున్నారు.
ఈ సినిమాను ఎన్టీయార్ తీస్తారని వేచి చూశానని, చివరికి తానే తీశానని క్రిష్ణ నాటి స్మృతులను నెమరువేసుకున్నారు. మొత్తానికి చెప్పాల్సింది ఏంటి అంటే రాముడు క్రిష్ణుడు అంటే ఎన్టీయార్ నే ఎలా అనుకుంటారో జనాలకు అల్లూరి అంటే క్రిష్ణ రూపమే గుర్తుకు వస్తుంది. అంతలా ఆయన సినిమాలో జీవించేశారు.