Begin typing your search above and press return to search.

`ఏజెంట్` కోసం రంగంలోకి సూప‌ర్ స్టార్?

By:  Tupaki Desk   |   11 April 2021 8:30 AM GMT
`ఏజెంట్` కోసం రంగంలోకి సూప‌ర్ స్టార్?
X
అఖిల్ అక్కినేని బ‌ర్త్ డే సంద‌ర్భంగా అత‌డు న‌టించే ఐద‌వ చిత్రం టైటిల్ ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. `ఏజెంట్` అనేది టైటిల్. గూఢ‌చారిగా అఖిల్ లుక్ కి అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఈ చిత్రం అఖిల్ కెరీర్ కి గ్రేట్ కంబ్యాక్ అవుతుంద‌ని కింగ్ నాగార్జున కూడా భావిస్తున్నార‌ట‌.

ఏజెంట్ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. స్టైలిష్ ఎపిసోడ్స్ తో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే థ్రిల్స్ తో కొన‌సాగుతుంది. స్టైలిష్ యాక్ష‌న్ చిత్రాల‌ స్పెషలిస్ట్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండ‌డంతో ఈ మూవీపై ఆస‌క్తి నెల‌కొంది. అఖిల్ ఈ చిత్రంలో గూఢ‌చారిగా క‌నిపిస్తారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ‌లో అఖిల్ మేకోవ‌ర్ ఆస‌క్తిని క‌లిగించింది.

ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం మాలీవుడ్ సూప‌ర్ స్టార్ మోహన్ లాల్ ను సంప్రదించార‌ని తాజాగా వెల్లడైంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చిత్ర‌బృందం ప్రకటించాల్సి ఉంది. యంగ్ ముంబై మోడల్ వైద్య సాక్షి ఈ చిత్రంలో అఖిల్ ప్రేయ‌సిగా క‌నిపించ‌నుంది. అనీల్ సుంకర .. సురేందర్ రెడ్డి సురేంద‌ర్ 2 సినిమా బ్యానర్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.