Begin typing your search above and press return to search.
15 మిలియన్ క్లబ్ లో సూపర్ స్టార్
By: Tupaki Desk | 1 Sept 2021 9:00 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో దూకుడు కొనసాగిస్తున్నాడు. ఆయన ఇన్ స్టా గ్రామ్ లో ఇప్పటికే 7.2 మిలియన్ ల ఫాలోవర్స్ తో చాలా స్పీడ్ గా 10 మిలియన్ ల ఫాలోవర్స్ కు పరుగులు తీస్తున్నాడు. మరో వైపు మహేష్ బాబు ఫేస్ బుక్ అకౌంట్ ఫాలోవర్స్ సంఖ్య అరుదైన రికార్డును దక్కించుకుంది. ఫేస్ బుక్ లో మహేష్ బాబు 15 మిలియన్ ల మార్క్ ను క్రాస్ చేశాడు. సౌత్ హీరోల్లో అతి కొద్ది మంది మాత్రమే 15 మిలియన్ ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. మహేష్ బాబు ఇటీవల కాలంలో ఉత్తరాదిన కూడా తన డబ్బింగ్ సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అందుకే సోషల్ మీడియా అకౌంట్స్ లో ఆయన ఫాలోవర్స్ సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది.
మహేష్ బాబు ఫేస్ బుక్ లో 15 మిలియన్ క్లబ్ లో చేరగా ట్విట్టర్ లో ఆయన్ను ఫాలో అవుతున్న వారు 11.6 మిలియన్ ల మంది ఉన్నారు. ఇలా అన్ని ప్లాట్ ఫామ్స్ పై కూడా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు ముందు మరింతగా తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మాత్రమే కాకుండా ముందు ముందు వచ్చే సినిమాలు ఆయన్ను మరింత మందికి దగ్గర చేస్తాయని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ను పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. అక్టోబర్ లో సినిమా ను పూర్తి చేసేలా చకచక షూటింగ్ చేస్తున్నారు. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత చేయబోతున్న సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ సినిమా అధికారికంగా ప్రకటన వచ్చింది. త్వరలోనే సినిమా ను పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి చేసిన ఈ సినిమాను వచ్చే ఏడాదిలో సమ్మర్ కు విడుదల చేస్తారట. ఇక సర్కారు వారి పాట సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమా ను వచ్చే సంక్రాంతికి విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించి విడుదల తేదీని కూడా వెళ్లడించారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది. కనుక ఆ సమయంలో మహేష్ బాలీవుడ్ స్టార్ అవ్వడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. అప్పుడు సౌత్ లో సోషల్ మీడియా ఫాలోయింగ్ లో మహేష్ నెం.1 అవ్వడం ఖాయంగా విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.