Begin typing your search above and press return to search.

హెడ్ మసాజ్ చేస్తున్న మహేష్ గారాలపట్టి!

By:  Tupaki Desk   |   24 April 2020 4:00 PM IST
హెడ్ మసాజ్ చేస్తున్న మహేష్ గారాలపట్టి!
X
మనదేశంలో లాక్ డౌన్ కారణంగా ఎప్పుడూ బిజీగా ఉండే హీరోలు ఇప్పుడు ఖాళీగా ఇంట్లో ఉంటున్నారు. మన టాలీవుడ్ హీరోలైతే కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నారు. ఇన్నేళ్ళుగా మిస్ అయిన టైమ్ అంతా ఇప్పుడు కవర్ చేస్తూ ఫ్యామిలీతి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ముఖ్యంగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కుటుంబానికే ముందు ప్రాధాన్యత ఇస్తారు. కరోనా ఇచ్చిన అనుకోని సెలవులను సంపూర్ణంగా వాడుకుంటున్నాడు. ఇంట్లో నుండి కాలు కూడా బయట పెట్టకుండా మహేష్ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ లాక్‌డౌన్ రోజులు ఏం చేయాలనేది కూడా ఈయన ముందుగానే ప్లాన్ చేసుకున్నాడట.

రోజు టైం అంతా పిల్లలతో గడిపేస్తున్నారట. మహేష్ బాబు జాళీగా పిల్లలతో గడుపుతున్న ఫోటోలను నమ్రత ఎప్పుటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి అప్డేట్స్ అందిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు కూతురు సితారతో హెడ్ మసాజ్ చేయించుకుంటున్న ఫోటోను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేశారు. గౌతమ్ ఆటలు ఆడుకుంటుంటే.. మహేష్ హెడ్ మసాజ్ వాలంటీర్ అయ్యాడని పేర్కొంది. సితార 2నిమిషాల పాటు మసాజ్ చేసిందని చెప్పారు. మొత్తానికి కరోనా లాక్‌డౌన్‌ను మహేష్ బాబు బాగానే యూటిలైజ్ చేసుకుంటున్నాడు. మొత్తానికి డైలీ పిల్లలతో ఆడుతున్న ఆటలను సోషల్ మీడియా లో షేర్ చేస్తుంటే ఆనందంగా ఉందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.