Begin typing your search above and press return to search.

క్లిక్‌ క్లిక్‌ః సూపర్‌ స్టార్‌ ఫ్యామిలీ న్యూ ఇయర్‌ వేడుక

By:  Tupaki Desk   |   1 Jan 2021 4:23 PM IST
క్లిక్‌ క్లిక్‌ః సూపర్‌ స్టార్‌ ఫ్యామిలీ న్యూ ఇయర్‌ వేడుక
X
సెలబ్రేషన్‌ అనగానే మహేష్‌ బాబు ఫ్యామిలీ గుర్తుకు వస్తుంది అనడంలో సందేహం లేదు. సందర్బం ఏదీ అయినా కూడా నమ్రత మహేష్‌ బాబులు తమ పిల్లలతో కలిసి చేసే సందడి అంతా ఇంతా కాదు. క్రిస్మస్.. సంక్రాంతి... బక్రీద్‌ ఇలా అన్ని పండుగలను కూడా సర్వమత సమ్మేళనం అన్నట్లుగా మహేష్ బాబు ఫ్యామిలీ జరుపుకుంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. మహేష్ బాబు ఫ్యామిలీ ఇతర సెలబ్రెటీ ఫ్యామిలీలకు కూడా ఆదర్శంగా ఉంటారు అనడంలో సందేహం లేదు. ఈసారి ఈ జంట కొత్త సంవత్సర వేడుకలతో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నారు.

మహేష్ బాబు మరియు నమ్రతలు ఈసారి కొత్త సంవత్సర వేడుకను ఇలా సన్నిహితులతో షేర్‌ చేసుకున్నారు. మహేష్‌ బాబు ప్రతి వేడుకలో కూడా సితార ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక ఈ సారి కొత్త సంవత్సరం వేడుకలో కూడా సితూ పాప క్యూట్‌ లుక్స్ తో ఆకట్టుకుంది. ఐ యామ్‌ టూ హాట్‌ ఫర్‌ యు అనే క్యాప్షన్‌ ఉన్న టీ షర్ట్‌ ను ధరించింది. ఇతర పిల్లలతో అల్లరి చేస్తూ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ తో కలిసి సితూ పాప నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొంది.