Begin typing your search above and press return to search.
కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్ లో సూపర్ స్టార్ ఫ్యామిలీ..!
By: Tupaki Desk | 31 May 2021 5:37 PM ISTతెలుగు సినిమా చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్నారు. తెలుగు వారి జేమ్స్ బాండ్ గా.. కౌబాయ్ గా.. మన్యందొర అల్లూరి సీతారామరాజుగా.. ఇలా చెప్పుకొంటూ పోతే తెలుగువారి గుండెల్లో నిలిచిపోయే ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారు కృష్ణ. 'తేనెమనుసులు' సినిమాతో హీరోగా పరిచయమైన కృష్ణ.. అనేక పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటి స్టార్ హీరోలు రెండేళ్లకో సినిమా చేయడమే గగనమవుతుంటే.. ఆయన ఏడాదికి సగటున 18 సినిమాలు చేయడం విశేషం. నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా, నిర్మాతగా సాంకేతికంగా తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి కృష్ణ.
నేడు నటశేఖర కృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక కృష్ణ పుట్టినరోజు వేడుకలు ఆయన చిన్న అల్లుడు, హీరో సుధీర్ బాబు ఇంట్లో సింపుల్ గా జరిగాయి. సుధీర్ నటిస్తున్న 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా థీమ్ తో రెడీ చేసిన స్పెషల్ కేక్ ని కృష్ణ తో కట్ చేయించారు. ముందుగా సతీమణి ఇందిర కు కేక్ తినిపించారు కృష్ణ. ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కృష్ణ బర్త్ డే వేడుకల్లో ఆయన సోదరుడు ఆది శేషగిరిరావు - సీనియర్ నరేష్ - పెద్ద అల్లుడు గల్లా జయదేవ్ - రెండో అల్లుడు సంజయ్ - చిన్నల్లుడు సుధీర్ బాబు - మనవడు గల్లా అశోక్ వంటి వారితో పాటుగా కూతుళ్లు మిగతా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇదిలావుండగా కృష్ణ చిన్న కొడుకు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సోషల్ మీడియా వేదికగా ఆయనకు విషెస్ అందించారు. 'హ్యాపీ బర్త్ డే నాన్న. నాకు ఎల్లప్పుడూ ఉన్నతమైన మార్గాన్ని చూపిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను' అని మహేష్ ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు తన తండ్రి పుట్టినరోజును పురస్కరించుకుని ఆంధ్ర హాస్పిటల్స్ సహకారంతో బుర్రిపాలెం గ్రామస్తులకు కోవిడ్ -19 టీకాల పూర్తి డ్రైవ్ ను స్పాన్సర్ చేశారు మహేష్ బాబు.