Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ కు ఇన్నాళ్లకు జ్ఞానోదయం అయ్యిందా?
By: Tupaki Desk | 16 Aug 2021 4:00 PM ISTబాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈమద్య కాలంలో చేస్తున్న సినిమాల్లో ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. ఆయన పారితోషికం వందల కోట్లు తీసుకుంటూ మేకింగ్ కోసం మాత్రం 50 నుండి 60 కోట్లు అంతకు తక్కువ ఖర్చు చేయిస్తున్నాడు. సినిమా ఎలా ఉన్నా.. నిర్మానాత్మక విలువలు ఎలా ఉన్నా కూడా తన సినిమా అనగానే జనాలు తెగ చూస్తారు.. కోట్ల రూపాయలు పెట్టి బయ్యర్లు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారు అనే ఉద్దేశ్యంతో సల్మాన్ ఇప్పటి వరకు భారీ బడ్జెట్ సినిమాలకు కాస్త దూరంగానే ఉంటూ వచ్చాడు. ఆయన చేసేవి ఎక్కువ శాతం మీడియం బడ్జెట్ సినిమాలే అయినా కూడా ఆయన స్టార్ డమ్ వల్ల వందల కోట్ల సినిమాలుగా అవి మారుతున్నాయి. అయితే ఇటీవల వచ్చిన రాధే సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. సల్మాన్ లాంటి హీరో ఇలాంటి సినిమాను చేయడం ఏంటీ అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. విమర్శకులు చీల్చి చెండాడిన రాధే సినిమా ఫలితమో లేదా మరేమో కాని సల్మాన్ ఖాన్ ఈసారి ఏకంగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడని సమాచారం అందుతోంది.
సల్మాన్ ఖాన్ హీరోగా సూపర్ హీరో కాన్సెప్ట్ తో సినిమా రూపొందబోతుంది అనే బాలీవుడ్ సమాచారం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు మంచి కథను కూడా ఈ సినిమా కోసం ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ ను కొట్టడం కోసం సల్మాన్ ఖాన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తన గత సినిమాల విషయంలో పారితోషికం ఎక్కువ తీసుకుని బడ్జెట్ తక్కువ ఖర్చు చేయించిన సల్మాన్ ఈసారి తన పారితోషికం విషయంలో పట్టింపులు లేకుండా భారీ బడ్జెట్ ను సినిమా మేకింగ్ కోసం ఖర్చు చేయిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను ఈ సినిమాతో దక్కించుకోవడమే లక్ష్యంగా సల్మాన్ ఖాన్ సినిమా చేయబోతున్నాడు.
ఈమద్య కాలంలో సౌత్ సినిమాలతో పోల్చితే బాలీవుడ్ సినిమాల బడ్జెట్ లు మరీ తక్కువగా ఉంటున్నాయి. స్టార్ హీరోలు కూడా ఒక్కరు ఇద్దరు తప్ప ఎక్కువ మంది భారీ బడ్జెట్ సినిమాలు కాకుండా మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. అయితే వారి పారితోషికాలు మాత్రం పదుల కోట్ల నుండి వందల కోట్ల వరకు ఉంటున్నాయి. సినిమా మేకింగ్ విషయంలో ఇప్పుడు చాలా మంది చాలా సీరియస్ గా ఉంటున్నారు. అందుకే బాలీవుడ్ లో కూడా ఇకపై వందల కోట్ల సినిమాలు కంటిన్యూగా రాబోతున్నాయన్నమాట. అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
ఆయన సక్సెస్ రేటు బాగుంది కనుక మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ ఉన్నా కూడా భారీగా జనాలు చూస్తున్నారు.. వసూళ్లు వస్తున్నాయి.. ఆయనకు వందల కోట్ల పారితోషికం అందుతోంది. ఆయన కూడా ఏడాదికి కనీసం ఒక్కటి అయినా భారీ బడ్జెట్ సినిమా చేయాలని ప్రస్తుతం భావిస్తున్నాడట. సౌత్ ఫిల్మ్ మేకర్స్ ను మరియు హీరోలను చూసి బాలీవుడ్ హీరోలు మరియు ఫిల్మ్ మేకర్స్ కూడా వందల కోట్ల బడ్జెట్ సినిమా లను తెరకెక్కించేందుకు సిద్దం అవుతున్నారు. ఇది శుభ పరిణామం అంటూ బాలీవుడ్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.