Begin typing your search above and press return to search.

త‌లైవా ఫ్యాన్స్ కి సూప‌ర్ స‌ర్ ప్రైజ్‌ రెడీ.. కానీ..?

By:  Tupaki Desk   |   22 Nov 2022 8:30 AM GMT
త‌లైవా ఫ్యాన్స్ కి సూప‌ర్ స‌ర్ ప్రైజ్‌ రెడీ.. కానీ..?
X
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అభిమానులకు సూప‌ర్ స‌ర్ ప్రైజ్ ని రెడీ చేస్తున్నారా? .. అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. ఈ మ‌ధ్య క్రేజీ స్టార్ ల‌కు సంబంధించిన కెరీర్ పాపుల‌ర్ మూవీస్ ని రీమాస్ట‌ర్ చేస్తూ రీ రిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ట్రెండ్ రీసెంట్ గా టాలీవుడ్ లో మొద‌లై కొంత మందికి కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. దీంతో ఈ వ్యాపారం భ‌లేగా వుందే అనుకుంటూ బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల‌కు సంబంధించిన క్రేజీ మూవీస్ ని రీ మాస్ట‌ర్ చేసి రీ రిలీజ్ చేస్తున్నారు.

స్టార్ హీరోల బ‌ర్త్ డే స్పెష‌ల్ ని టార్గెట్ చేస్తూ మొద‌లైన ఈ ట్రెండ్ ఇప్పుడు స్టార్ ల క్రేజీ సినిమాల్లో ఏది న‌చ్చితే దాన్ని రీ రిలీజ్ లు చేసే వ‌ర‌కు వ‌చ్చింది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన ఇండ‌స్ట్రీ హిట్ మూవీ 'పోకిరి'తో ఈ రీ రిలీజ్ ల ట్రెండ్ మొదలైంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఫార్మాట్ లో రీ మాస్ట‌ర్ చేయ‌బ‌డి రీ రిలీజ్ అయిన సినిమాల్లో ఒక‌టి రెండు మాత్ర‌మే మంచి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాయి.

'పోకిరి' త‌రువాత ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ న‌టించిన 'జ‌ల్సా'ని రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ రెండు సినిమాలు అభిమానుల్ని ఖుషీ చేయ‌డ‌మే కాకుండా మంచి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టాయి. దీంతో ఈ త‌ర‌హాలో మ‌రిన్ని సినిమాల‌ని రీ మాస్ట‌ర్ చేసి రీ రిలీజ్ చేయాల‌నే డిమాండ్ ల‌తో పాటు నిర్మాత‌ల అత్యుత్సాహం కూడా మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చిన ప్ర‌భాస్ 'బిల్లా' ఆక‌ట్టుకోగా 'రెబ‌ల్‌' నిరుత్సాహ ప‌రిచింది.

ఇక బాల‌య్య 'చెన్న‌కేశ‌వ రెడ్డి' స‌రిస్థితి కూడా అంతే. హిట్ సినిమాల‌ని రీ మాస్ట‌ర్ చేస్తే చూసిన ఫ్యాన్స్ అదే హీరోల ఫ్లాప్ ల‌కు అంత‌గా ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన 'బాబా' మూవీని రీ మాస్ట‌ర్ చేసి రిలీజ్ చేయ‌బోతున్నారు. 2002లో రిలీజైన 'బాబా' ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌లేక ఫ్యాన్స్ ని నిరుత్సాహ ప‌రిచింది. అలాంటి మూవీని మ‌ళ్లీ రీ మాస్ట‌ర్ చేసి ర‌జ‌నీ పుట్టిన రోజైన డిసెంబ‌ర్ 12న రీ రిలీజ్ చేయ‌బోతుండ‌టం ఫ్యాన్స్ ఎట్రాక్ట్ చేయ‌డం లేద‌ట‌.

ఫ్లాప్ సినిమా క‌న్నా హిట్ సినిమాని రీ మాస్ట‌ర్ చేసి రీ రిలీజ్ చేసి వుంటే బాగుంటుంది క‌దా అని ఫ్యాన్స్ వాపోతున్నారు. 'బాబా' మూవీని త‌మిళ వెర్ష‌న్ తో పాటు తెలుగు లోనూ విడుద‌ల చేయ‌బోతున్నారు. ఎవ‌రు రిలీజ్ చేస్తున్నారు?.. ఏ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నార‌న్న‌ది త్వ‌ర‌లోనే ఓ క్లారిటీ రానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.