Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ మూవీకి ముగింపు ఎన్నికల తర్వాతేనా?
By: Tupaki Desk | 9 Dec 2020 6:00 AM ISTతమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం పై క్లారిటీ వచ్చేసింది. డిసెంబర్ 31న పార్టీని ప్రకటించబోతున్నట్లుగా రజినీకాంత్ అధికారికంగా చెప్పేశాడు. వచ్చే ఏడాది ఆరంభంలో జరుగబోతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం సమాయత్తం అవ్వబోతున్నట్లుగా కూడా పేర్కొన్నాడు. తమిళనాడు ప్రజలకు మంచి రోజులు రాబోతున్నట్లుగా రజినీకాంత్ చేసిన ప్రకటన అందరి దృష్టిని ఆకర్షించింది. రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి క్లారిటీ వచ్చిన ఈ సమయంలోనే ఆయన ప్రస్తుతం నటిస్తున్న అన్నాత్తే సినిమా పరిస్థితి ఏంటీ అంటూ చర్చించుకుంటున్నారు. తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లే అంటున్నారు.
దాదాపుగా సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఎన్నికల తర్వాతే అంటే మార్చి లేదా ఏప్రిల్ తర్వాతే మళ్లీ పట్టాలెక్కించే అవకాశం ఉంది. అదృష్టం బాగుండి రజినీకాంత్ సీఎం అయితే అన్నాత్తే ఉంటుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. ఈ సినిమాలో రజినీకాంత్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెల్సిందే. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై తెలుగు మరియు తమిళ సినీ ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. కాని ఎన్నికల వల్ల.. రజినీ రాజకీయం వల్ల అన్నాత్తే మద్యలోనే ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు పునః ప్రారంభం అయ్యేది క్లారిటీ లేదు. కరోనా కారణంగా అన్నాత్తే షూటింగ్ మార్చిలో నిలిచి పోయిన విషయం తెల్సిందే. జనవరిలో షూటింగ్ పునః ప్రారంభించాల్సి ఉండగా రజినీకాంత్ రాజకీయ ఎంట్రీ వల్ల మొత్తం తారు మారు అయ్యింది.