Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : సూపర్‌ స్టార్‌ చేతిలో ఈ సూపర్‌ కిడ్‌ ఎవరబ్బా..?

By:  Tupaki Desk   |   12 March 2020 7:31 AM GMT
పిక్‌ టాక్‌ : సూపర్‌ స్టార్‌ చేతిలో ఈ సూపర్‌ కిడ్‌ ఎవరబ్బా..?
X
సోషల్‌ మీడియా సెన్షేషన్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు చెందిన ఏ ఫొటో అయినా కూడా వైరల్‌ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. మహేష్‌ బాబు ఫ్యాన్‌ పేజీలో పోస్ట్‌ అయిన ఈ ఫొటో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పాత ఫొటోనే అయినా ఈ ఫొటో ఇన్ని రోజులు కనిపించలేదు. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఫొటోలో మహేష్‌ బాబు తనకంటే క్యూట్‌ గా ఉన్న అబ్బాయిని ఎత్తుకుని ఉన్నాడు.

క్యూటర్‌ అండ్‌ క్యూటెస్ట్‌ అంటూ ఫ్యాన్స్‌ ఈ ఫొటోకు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇద్దరు క్యూట్‌ నెస్‌ తో సూపర్బ్‌ గా ఉన్నారు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంతకు ఈ సూపర్‌ కిడ్‌ ఎవరై ఉంటారబ్బా అంటూ చాలా మంది నెట్‌ లో సెర్చ్‌ చేస్తున్నారు. మహేష్‌ బాబు సింపుల్‌ షర్ట్‌ తో సింపుల్‌ స్మైల్‌ తో ఈ ఫొటోలో ఫ్యాన్స్‌ తో పాటు అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఇక బాబు కూడా చెక్స్‌ షర్ట్‌ తో క్యూట్‌ లుక్స్‌ తో మహేష్‌ కలర్‌ తో తనపైకి అందరి చూపు లాక్కుంటున్నాడు.

మహేష్‌బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సక్సెస్‌ దక్కించుకున్నాడు. ఆయన తదుపరి చిత్రం ఇంకా ప్రకటన రాలేదు. త్వరలోనే మహేష్‌ 27వ చిత్రంకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంతా ఎదురు చూస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయాల్సి ఉన్నా కూడా ఆ సినిమా కాస్త వాయిదా వేశారట. మరి మహేష్‌ 27కు దర్శకుడు ఎవరు అనేది త్వరలోనే వెళ్లడయ్యే అవకాశం ఉంది.