Begin typing your search above and press return to search.

విశాఖ రాజ‌ధాని లో మ‌హేష్ ఏఎంబీ సినిమాస్

By:  Tupaki Desk   |   18 Feb 2020 4:03 PM IST
విశాఖ రాజ‌ధాని లో మ‌హేష్ ఏఎంబీ సినిమాస్
X
రాజ‌ధాని అమ‌రావ‌తి నుంచి విశాఖ‌కు త‌ర‌లి వెళ్లిపోవ‌డం ఖాయ‌మ‌వ్వ‌డం తో సినిమా వాళ్ల చూపు అటువైపు మ‌ళ్లిన సంగ‌తి చూస్తున్నదే. వైజాగ్ టాలీవుడ్ ఏర్పాటులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఫిలిం స్టూడియో ప్లాన్ చేయ‌డం.. అటుపై ఒక‌రొక‌రుగా అక్క‌డ యాక్టివిటీస్ పై ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌డం చూస్తున్న‌దే. వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ లోనూ యాక్టివిటీస్ ని మ‌రింత పెంచారని తెలుస్తోంది. ఇక‌ పై సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లో భారీ చిత్రాల‌న్నిటినీ ఆయ‌న ఇక్క‌డే చిత్రీక‌రించ‌నున్నారుట‌.

మ‌రోవైపు విశాఖ రాజ‌ధానిపై సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌హా ఏషియ‌న్ సినిమాస్ అధినేత‌లు ఎంతో ఆస‌క్తిగా ఉన్నార‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. రాజ‌ధాని ఏర్పాటైతే వైజాగ్ మ‌రింత ర‌ద్ధీగా మార‌నుంది. ఆ క్ర‌మంలోనే ఇక్క‌డ మ‌ల్టీప్లెక్స్ బిజినెస్ కి డిమాండ్ పెరుగుతుంద‌ని గ్ర‌హించిన మ‌హేష్ - ఏషియ‌న్ బృందం వెంట‌నే విశాఖ న‌గ‌రంలో ఏఎంబీ సినిమాస్ మ‌ల్టీప్లెక్స్ ని నిర్మించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. అందుకోసం జ‌గ‌దాంబ ప‌రిస‌రాల్లోనే ప్రైమ్ ఏరియాని ఎంపిక చేసుకున్నార‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే హైద‌రాబాద్ గచ్చిబౌళి లో ఏఎంబీ పెద్ద సక్సెసైన నేప‌థ్యం లో అటు బెంగ‌ళూరులోనూ ఇదే త‌ర‌హాలో భారీగా ఏఎంబీ మాల్ ని నిర్మిస్తున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ త‌ర‌హా భారీ మల్టీప్లెక్స్ సినిమా థియేట‌ర్ల‌ను నిర్మించే ప్లాన్ చేయ‌డం వేడెక్కిస్తోంది. ముఖ్యంగా హైద‌రాబాద్ త‌ర్వాత అమ‌రావ‌తిని కాకుండా విశాఖ న‌గ‌రాన్ని టార్గెట్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇంట్రెస్టింగ్ గా ఈసారి మ‌హేష్ - ఏషియన్ నారంగ్ తో పాటుగా డి.సురేష్ బాబు విశాఖ ఏఎంబీ ఫ్రాంఛైజీ లో చేరుతుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సీఎం జ‌గ‌న్ ఇలా రాజ‌ధాని ప్ర‌క‌టించారో లేదో అలా విశాఖ‌కు మ‌హ‌ర్థ‌శ ప‌ట్టుకుంద‌న‌డానికి ఇంత‌కంటే ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి? మునుముందు నెమ్మ‌దిగా టాలీవుడ్ వైజాగ్ కి షిఫ్ట్ అవుతుంద‌న్న ప్ర‌చారం వేడెక్కిస్తోంది. తాజా ప‌రిణామంతో వైజాగ్ ఔట‌ర్లోనూ భూముల ధ‌ర‌లు చుక్క‌ల్ని తాకుతున్నాయి.