Begin typing your search above and press return to search.

గూఢచారి సినిమాకి సూపర్ స్టార్ సపోర్ట్

By:  Tupaki Desk   |   9 Feb 2017 5:33 AM GMT
గూఢచారి సినిమాకి సూపర్ స్టార్ సపోర్ట్
X
అడివి శేష్ ఇప్పటికే నెగిటివ్ కేరక్టర్లతోను.. హీరోగాను టాలీవుడ్ ఆడియన్స్ ను మెప్పించేశాడు. గతేడాది క్షణం మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఇప్పుడు గూఢచారి అంటూ ఓ మూవీ చేస్తున్న అడివి శేష్. అభిషేక్ నామా ఈ చిత్రానికి నిర్మాత కాగా.. తెలుగమ్మాయి అయిన మాజీ మిస్ ఇండియా శోభిత ధూళిపాళ.. టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అవుతోంది.

ప్రస్తతం హైద్రాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. మొదట్లో చిన్న మూవీ అనుకున్న ఈ గూఢచారి.. ఇప్పుడు పెద్ద సినిమా అయిపోయింది. కీలకమైన పాత్రలకు.. ప్రకాష్ రాజ్.. జగపతి బాబులను తీసుకున్నట్లు తెలిపింది యూనిట్. వీళ్లిద్దరూ ప్రస్తుతం బాగా కాస్ట్లీ యాక్టర్స్ అనే సంగతి తెలిసిందే. వీరితో పాటు ఓ చిన్న కేరక్టర్ కోసం సూపర్ స్టార్ కృష్ణను కూడా అప్రోచ్ అయ్యారట మేకర్స్. అయితే.. నటించే విషయంలో ఆయన ఏ విషయం చెప్పలేదట. ప్రస్తుతం యాక్టింగ్ విషయంలో ఆయన అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదని అంటున్నారు గూఢచారి కి డైరెక్షన్ వహిస్తున్న దర్శక ద్వయం రాహుల్ పాకాల-శశికిరణ్.

సినిమాలో నటించకపోయినా.. వీలైనంత మద్దతు మాత్రం ఇస్తానని చెప్పారట కృష్ణ. ఆంధ్రా జేమ్స్ బాండ్ అయిన సూపర్ స్టార్ కృష్ణ చిన్న పాత్ర చేసినా.. తమ సినిమాకు ప్లస్ అవుతుందంటున్న మేకర్స్.. కొన్ని సీన్స్ లో అయినా కనిపించమని మరోసారి సూపర్ స్టార్ కృష్ణను రిక్వెస్ట్ చేస్తామంటున్నారు. మొత్తానికి చిన్న సినిమాగా మొదలై.. ఇప్పుడు పెద్ద సినిమాగా మారిపోతున్నాడు అడివి శేష్ గూఢచారి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/