Begin typing your search above and press return to search.

అక్కాచెల్లి క‌లిసి చేసిన ఆ సూప‌ర్ స్పెష‌లేంటి?

By:  Tupaki Desk   |   26 May 2022 11:30 PM GMT
అక్కాచెల్లి క‌లిసి చేసిన ఆ సూప‌ర్ స్పెష‌లేంటి?
X
అక్క‌ని మించి చెల్లి. చెల్లి ని మించి అక్క‌. ఇలా ఒకరికొక‌రు అందాల ఆర‌బోత‌లో ఇన్ స్టాలో పోటీ ప‌డుతుంటుంటారు. బోల్డ్ అవ‌తార్ లో భామా మ‌ణులిద్దరి మ‌ధ్య బిగ్ ఫైటే న‌డుస్తుంది. బికినీ నుంచి డిజైన‌ర్ దుస్తుల వ‌ర‌కూ అక్కా చెల్లి గ్లామ‌ర్ ఎలివేష‌న్లు పీక్స్ లో ఉంటాయి. ఆ గ్లామ‌ర్ మంట‌ల్లో యువ‌త చిత్తు అవ్వాల్సిందే.

తాజాగా శ‌ర్మా సిస్ట‌ర్స్ ఇన్ స్టో లో జంట‌గా ఓ ఫోటో పోస్ట్ చేసారు. ఇందులో అక్కా చెల్లి ఇద్ద‌రు ఎలివేష‌న్ల‌కు దూరంగా డీసెంట్ ఫోజులో క‌నిపిస్తున్నారు. నేహాశ‌ర్మ బ్లాక్ క‌ల‌ర్ దుస్తుల్లో...ఐశా శ‌ర్మ వైట్ క‌ల‌ర్ దుస్తుల్లో థై ఎలివేష‌న్లు ఇంచ్చింది. ఇలా ఇద్ద‌రు ఇన్ స్టా లోకి రావ‌డం వెనుక ఓ పెద్ద కార‌ణమే ఉందండోయ్.

''దీన్ని మీతో పంచుకోవడానికి నేను ఎంత ఉత్సాహంగా ఉన్నాను. నాకు మాటలు రావ‌డం లేదు. నేను ఐషా @aishasharma25 మరియు అద్భుతమైన బృందంతో కలిసి సృష్టించిన సూపర్ స్పెషల్. జూన్‌లో వస్తుంది. మీ అంద‌రికీ క‌చ్చితంగా న‌స్తుంద‌ని '' పోస్ట్ పెట్టింది. ఇలా పోస్ట్ ..ఫోటో అయితే పెట్టింది గానీ అస‌లు సంగ‌తి మాత్రం రివీల్ చేయ‌లేదు.

అక్కా చెల్లి ఇద్ద‌రు చేస్తోన్న ఆ సూప‌ర్ స్పెష‌ల్ ఏంటి? అన్న‌ది తెలియాలంటే రిలీజ్ వ‌ర‌కూ వెయిట్ చేయాలేమో. ఓసారి వివ‌రాలు చెక్ చేస్తే నేహాశెట్టి కొన్నాళ్లుగా ఖాళీగానే ఉంటుంది. బాలీవుడ్ లో పెద్ద‌గా సినిమాలు చేయ‌లేదు. ఆమె గ‌త సినిమా 'జోగిరా సా రా రా' కూడా రిలీజ్ అయింది. అప్ప‌టి నుంచి మ‌ళ్లీ కొత్త ప్రాజెక్ట్ ఏదీ ప్ర‌క‌టించ‌లేదు.

వెబ్ సిరీస్ లు..ఆల్బమ్స్ కూడా చేసింది లేదు. అటు ఐశా శ‌ర్మ కి అవ‌కాశాలే రాలేదు. చెల్లి కోసం నేహా శ‌ర్మ చాలా కాలంగా కృషి చేస్తుంది. తెలిసిన వాళ్ల‌ని అవ‌కాశాలు అడుగుతున్నా లాభం లేక‌పోతుంది. చెల్లిని మంచి స్టార్ ని చేయాల‌ని తెగ త‌పిస్తుంది. కానీ ప‌న‌వ్వ‌డం లేదు.

దీంతో లాభం లేద‌నుకున్న అక్కా చెల్లి ఇద్ద‌రు సొంతంగా..క్రియేటివ్ గా ఏదైనా ప్లాన్ చేసి జూన్ లో దాన్ని రిలీజ్ చేస్తున్నారా? అన్న‌ది తెలియాలి. ఇప్పుడు ట్యాలెంట్ బ‌య‌ట పెట్టుకోవ‌డానికి సోష‌ల్ మీడియా ఎంతో ఉప‌యుక్తంగా మారింది. యూ ట్యూబ్ .. ఇన్ స్టాలో లీక్ చేస్తే కోట్ల మందికి చేరిపోతుంది. కంటెంట్ బాగుంటే అదే స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తుంది.