Begin typing your search above and press return to search.

సూపర్‌ సెక్సీ చూపుల చిన్నదాని కవ్వింత

By:  Tupaki Desk   |   4 Feb 2022 1:30 AM GMT
సూపర్‌ సెక్సీ చూపుల చిన్నదాని కవ్వింత
X
బాలీవుడ్‌ టాప్ హీరోయిన్స్ జాబితాలో ముందు వరుసలో ఉండే ముద్దుగుమ్మ దీపిక పదుకునే. ఈ అమ్మడు 2006 సంవత్సరంలో హీరోయిన్ గా కన్నడ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ వెంటనే అనూహ్యంగా బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటించిన ఓం శాంతి ఓం సినిమా లో అవకాశం దక్కింది. 2007 సంవత్సరంలో వచ్చిన ఆ సినిమా దీపిక పదుకునే ను బాలీవుడ్‌ లో స్టార్‌ గా నిలిపింది.

మొదటి సినిమాతోనే ఉత్తరాది ప్రేక్షకుల అభిమానం ను దక్కించుకున్న దీపికా పదుకునే అప్పటి నుండి ఇప్పటి వరకు వెనుదిరిగి చూసుకోకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తుంది. పెద్ద ఎత్తున ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు మరియు కమర్షియల్స్‌ ఈమె స్థాయిని మరింతగా పెంచాయి.. ఇంకా పెంచుతూనే ఉన్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న దీపిక పదుకునే తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న ఫొటోలు ఆమె అభిమానులకు కన్నుల వింధు చేస్తున్నాయి.

తాజాగా షేర్‌ చేసిన ఈ ఫొటోలు ఆమె గురించి మళ్లీ అభిమానుల్లో చర్చ జరిగేలా చేసింది. పెళ్లి అయ్యి ఏళ్లు గడుస్తున్నా కూడా అందంలో ఏమాత్రం తగ్గుదల లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు దీపికా పదుకునే అందం రోజు రోజుకు పెరుగుతుంది.

ఏ కాస్ట్యూమ్స్‌ లో అయినా.. ఎలాంటి ఔట్‌ ఫిట్‌ లో అయినా కూడా ఈ అమ్మడి అందం ఏమాత్రం తగ్గలేదు. ఈమె షేర్ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు ఈమె స్థాయిని మరియు క్రేజ్‌ ను రోజు రోజుకు పెంచుతున్నాయి అనడంలో సందేహం లేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు దశాబ్దంన్నర అయినా కూడా ఈ అమ్మడు ఇంకా కూడా స్టార్‌ హీరోయిన్ గా కొనసాగుతుంది అంటే ఆమె అందం తో పాటు ఆమె ప్రతిభ మరియు నటనను ప్రేక్షకులు ఎంతగా అభిమానిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా రెడ్‌ టాప్ జీన్స్ వేసుకున్న ఫొటోలను షేర్‌ చేసిన దీపిక పదుకునే సెక్సీ చూపులతో కవ్విస్తూ ఆకట్టుకుంది. పెద్దగా ఏమీ లేదు.. కేవలం కొన్ని గొప్ప జీన్స్ అంటూ కామెంట్‌ పెట్టింది.

ఈ ఫొటోలకు లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. దీపిక పదుకునే ఈ ఫొటోలు షేర్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఏకంగా 12 లక్షల మంది లైక్స్ చేశారు. అంతే కాకుండా ఈ ఫొటోలకు లక్షల మంది పాజిటివ్‌ గా కామెంట్స్ చేశారు. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ఇటీవల 83 సినిమా తో భర్తతో కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా లో ఈ అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇంగ్లీష్‌ ప్రాజెక్ట్‌ ల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్న ఈ అమ్మడు ముందు ముందు హాలీవుడ్‌ లో కూడా మోస్ట్‌ వాంటెడ్‌ గా మారుతుందేమో చూడాలి.