Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : సూపర్‌ రొమాంటిక్ 'ఖిలాడి' కపుల్‌

By:  Tupaki Desk   |   5 Feb 2022 6:30 AM GMT
ఫొటోటాక్ : సూపర్‌ రొమాంటిక్ ఖిలాడి కపుల్‌
X
రవితేజ హీరోగా డింపుల్‌ హయతీ హీరోయిన్ గా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఖిలాడి సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఇప్పటికే విడుదల అవ్వాల్సిన ఈ మోస్ట్‌ క్రేజీ ప్రాజెక్ట్‌ కరోనా వల్ల కాస్త ఆలస్యంగా విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల ఆలస్యం అయినా అంచనాలు మాత్రం ఏమాత్రం తగ్గక పోగా.. రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఖిలాడి నుండి బ్యాక్ టు బ్యాక్ వచ్చిన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్‌ స్వరపర్చిన పాటలు సినిమా పై అంచనాలు పెంచుతూ వస్తున్నాయి. ఇప్పటికే నాలుగు పాటలు విడుదల అయ్యాయి. నేడు అయిదవ పాట అయిన క్యాచ్‌ మీ ని విడుదల చేయబోతున్నారు.

క్యాచ్ మీ పాట విడుదలకు సంబంధించి చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేస్తున్న పోస్టర్ లు సినిమా పై అంచనాలు పెంచేస్తున్నాయి. హీరోయిన్ డింపుల్‌ హయతీ ఈ సినిమాలో మాంచి రొమాంటిక్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్న డింపుల్‌ ఈ సినిమాతో తన అందాలతో పాటు నటనతో కూడా మెప్పించబోతుంది. రవితేజ మరియు డింపుల్‌ ల జోడీ ఫుల్‌ రొమాంటిక్ గా ఉంటుంది అంటూ మొదటి నుండి చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. వారు చెప్పింది నిజమే అన్నట్లుగా ఈ క్యాచ్ మీ పాట స్టిల్స్ ఉన్నాయి. తాజాగా మేకర్స్ షేర్ చేసిన ఈ పోస్టర్‌ ప్రేక్షకుల్లో హీట్‌ ను పెంచే విధంగా ఉంది అనడంలో సందేహం లేదు. ఖిలాడి కపుల్‌ కలర్ ఫుల్‌ గా మాంచి సూపర్‌ రొమాంటిక్ గా ఉన్నారంటూ కామెంట్స్ వస్తున్నాయి.

రాక్ స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ నుండి రాబోతున్న ఈ అయిద పాట క్యాచ్ మీ ఖచ్చితంగా సినిమా స్థాయిని మరింతగా పెంచే విధంగా ఉంటుందంటూ రవితేజ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమా లో రవితేజ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పారు. తాజాగా సినిమా నుండి ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ అంచనాలు పెంచేస్తున్నారు. తాజాగా చంద్రకళ గా అనసూయ కనిపించబోతుంది అంటూ ఆమె పాత్ర లుక్ ను రివీల్‌ చేశారు. సింపుల్‌ చీర కట్టులో ఒక పద్దతైన సంసారపక్షం మహిళగా అనసూయ లుక్ ఉండి ఆసక్తి పెంచేస్తుంది. మొత్తానికి ఖిలాడి సినిమా ప్రతి పోస్టర్ కూడా సినిమా పై అంచనాలు పెంచుతూనే ఉన్నాయి. మరి ఖిలాడి ఈ అంచనాలకు తగ్గట్లుగా ఎంటర్‌ టైన్ చేస్తాడా అనేది చూడాలి.