Begin typing your search above and press return to search.

శర్వానంద్ వదిలిన 'సూపర్ ఓవర్' స్నీక్‌ పీక్‌..!

By:  Tupaki Desk   |   16 Jan 2021 2:58 PM GMT
శర్వానంద్ వదిలిన సూపర్ ఓవర్ స్నీక్‌ పీక్‌..!
X
ప్రముఖ తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' సినిమాలు వెబ్ సిరీస్ లతో పాటు స్పెషల్ షో లను కూడా స్ట్రీమింగ్ కి పెడుతూ వీక్షకులను అలరిస్తూ వస్తోంది. 'భానుమతి అండ్ రామకృష్ణ' 'మా వింతగాథ వినుమా' 'కలర్‌ ఫొటో' 'ఒరేయ్‌ బుజ్జిగా' వంటి సినిమాలు.. 'మెయిల్' వంటి వెబ్ సిరీస్ లతో పాటు సమంత అక్కినేని హోస్టుగా 'సామ్‌ జామ్‌' టాక్‌ షో.. హర్ష చెముడుతో 'తమాషా' వంటి కార్యక్రమాలు కూడా స్ట్రీమింగ్ కి పెట్టారు. ఈ క్రమంలో తాజాగా ''సూపర్ ఓవర్'' చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

జనవరి 22న ఆహా యాప్ లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా 'సూపర్‌ ఓవర్‌' స్నీక్‌ పీక్‌ ను శనివారం యువ హీరో శర్వానంద్ ట్విట్టర్ వేదికగా విడుదల చేసి యూనిట్‌ కు అభినందనలు తెలిపారు. ఇది క్రికెట్‌ బెట్టింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇందులో నవీన్ చంద్ర - చాందిని చౌదరి - అజయ్ - రాకేందు మౌళి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్‌ ప్రవీణ్‌ వర్మ తెరకెక్కించగా.. సుధీర్‌ వర్మ నిర్మించారు.