Begin typing your search above and press return to search.
ఆశ వదిలేసిన మెగా అల్లుడు
By: Tupaki Desk | 14 Dec 2020 2:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన 'సూపర్ మచ్చి' సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. థియేటర్లు ఓపెన్ అయిన వెంటనే ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. కాని అనూహ్యంగా థియేటర్లు ఓపెన్ అయినా కూడా జనాలు మాత్రం థియేటర్ల వైపు చూడటం లేదు. దాంతో చేసేది లేక సూపర్ మచ్చి సినిమాను విడుదల వాయిదా వేస్తూ వస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను విడుదల చేయాలని మొన్నటి వరకు అనుకున్నా ఆ తర్వత కూడా పరిస్థితి ఎలా ఉంటుందో క్లారిటీ లేదు. మరో ఆరు నెలల వరకు థియేటర్లలో చిన్న సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు వస్తారు అనే నమ్మకం లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
థియేటర్ల పరిస్థితి సరిగా లేని కారణంగా సూపర్ మచ్చి సినిమాను త్వరలోనే డైరెక్ట్ ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారంటూ సమాచారం అందుతోంది. పులి వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో ఖుషితో కలిసి రిజ్వాన్ నిర్మించాడు. ప్రస్తుతం నిర్మాతలు సినిమా విడుదల నిమిత్తం చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. నిర్మాతలు ఆశించిన మొత్తం వస్తే జనవరి లేదా ఫిబ్రవరిలో ఓటీటీ ద్వారా మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన రెండవ సినిమా సూపర్ మచ్చి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.