Begin typing your search above and press return to search.

బృహన్నలగా మారిన సేతుపతి

By:  Tupaki Desk   |   9 Oct 2018 5:24 AM GMT
బృహన్నలగా మారిన సేతుపతి
X
విజయ్ సేతుపతి తమిళంలో ఇప్పుడొక క్రేజీ హీరో. ఇతర దక్షిణాది భాషలలో తన సినిమాలు ఇంకా రిలీజ్ కాలేదుగానీ సౌత్ లో ఉండే సినీ ప్రేమికులకు అందరికీ సేతుపతి పేరు పరిచయమే. ఇక 'సైరా' లో ఒక కీలక పాత్ర పోషిస్తూ ఉండడంతో తెలుగుప్రేక్షకుల్లో కూడా సేతుపతి పై ఆసక్తి వ్యక్తమవుతోంది. రీసెంట్ గా '96' సినిమా తో తమిళ నట సూపర్ హిట్ సాధించిన విజయ్ సేతుపతి తన తాజా చిత్రం 'సూపర్ డీలక్స్' ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరికీ షాక్ ఇచ్చాడు.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక హిజ్రా పాత్ర పోషిస్తున్నాడు. దీంతో పోస్టర్ లో తమిళ బృహన్నల గా రెడీ అయ్యాడు. కాకపోతే మరీ మోటుగా కాకుండా లేడీ గెటప్ లో 'బృహన్నల 0.5' లా కనిపించాడు. రజనీకాంత్ 2.0 అయితే సేతుపతి 0.5 అనుకోవచ్చు. ఈ 'సూపర్ డీలక్స్' లో విజయ్ సేతుపతి శిల్ప అనే క్యారక్టర్ చేస్తున్నాడట. విజయ్ ఇప్పటి వరకూ చేసిన క్యారెక్టర్ల కు పూర్తిగా భిన్నమైనది కాబట్టి మరోసారి ఆడియన్స్ ను తన నటనతో ఆకట్టుకోవడం ఖాయం.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి తో పాటు గా సమంతా అక్కినేని.. ఫహద్ ఫాజిల్.. రమ్యకృష్ణ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమా కు సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా.