Begin typing your search above and press return to search.
సూపర్ 30: కొత్త పోస్టర్ అదిరిందిగా
By: Tupaki Desk | 3 Jun 2019 11:15 AM ISTఖాన్ల తర్వాత ప్రేక్షకుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ స్టార్లలో హృతిక్ రోషన్ ఒకరు. బాలీవుడ్ గ్రీక్ గాడ్ గా పేరు తెచ్చుకున్న హృతిక్ సాధారణంగా స్టైల్ అనే పదానికి పర్యాయపదంగా.. ఫిట్నెస్ అనే పదానికి చిరునామాగా ఉంటాడు. అందుకే ఆయన కొత్త సినిమాకోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. హృతిక్ ప్రస్తుతం వికాస్ బాల్ దర్శకత్వంలో 'సూపర్ 30' అనే ఒక బయోపిక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ పోస్ట్ రిలీజ్ చేశారు నిర్మాతలు.
'సూపర్ 30' నిజానికి రిపబ్లిక్ డే నాడు విడుదల కావల్సిన సినిమా. కానీ వాయిదా పడింది. మరోసారి జూలై 26 న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. కానీ అదే సమయానికి కంగనా రనౌత్ తాజా చిత్రం 'మెంటల్ హై క్యా' ను రిలీజ్ చేస్తున్నారు. హృతిక్ - కంగనా ఇద్దరి మధ్య జరిగిన రచ్చ.. మధ్యలో రంగోలి జింతాత జిత జిత అందరికీ తెలిసిందే. మరోసారి ఈ హంగామా ఎందుకనే ఉద్దేశంలో 'సూపర్ 30' టీమ్ తమ విడుదల తేదీని జూలై 12 కు మార్చారు. ఆ విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ సినిమా ప్రముఖ గణితవేత్త.. సూపర్ 30 అనే కార్యక్రమం ద్వారా ఎందరో పేద విద్యార్థులకు ఐఐటీలో ప్రవేశం కల్పించేలా ట్రైనింగ్ ఇస్తున్న ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ బయోపిక్ థీమ్ కు తగ్గట్టే పోస్టర్ కూడా అదిరిపోయింది. రెగ్యులర్ స్టైల్ కు భిన్నంగా హృతిక్ ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తిలా కనిపిస్తున్నాడు. గెడ్డం పెంచుకొని.. హాఫ్ షర్ట్ ధరించి.. వానలో తడుస్తూ ఆనందంగా కనిపిస్తున్నాడు.ఇదే పోస్టర్లో చాలామంది విద్యార్థులు కూడా ఎగిరి గంతులేస్తూ ఉన్నారు. నేపథ్యంలో ఒక బోర్డుపై గణిత సమీకరణాలు కూడా ఉన్నాయి. ఓవరాల్ గా పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేదిగా ఉంది.