Begin typing your search above and press return to search.

సన్నీలియోన్‌ ను సరికొత్తగా చూపిస్తారట

By:  Tupaki Desk   |   20 April 2021 4:15 AM GMT
సన్నీలియోన్‌ ను సరికొత్తగా చూపిస్తారట
X
బాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ సన్నీలియోన్‌ ను సౌత్‌ సినీ ఇండస్ట్రీకి తీసుకు వచ్చేందుకు మేకర్స్ ఉవ్విల్లూరుతున్నారు. ఇప్పటికే సౌత్‌ లోని అన్ని భాషల్లో సన్నీలియోన్‌ ప్రధాన పాత్రలో ఒక సినిమా రూపొందుతుంది. కరోనా మరియు ఇతరత్ర కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. త్వరలోనే ఆ ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామని మేకర్స్‌ చెబుతున్నారు. ఆ ప్రాజెక్ట్‌ ఇంకా ముగియక ముందే సన్నీలియోన్‌ కు మరో భారీ ఆఫర్‌ తలుపు తట్టింది. ఛారిత్రాత్మక నేపథ్యంలో రూపొందబోతున్న సినిమాలో సన్నీలియోన్‌ కు రాణి పాత్రలో నటించే ఛాన్స్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

సన్నీలియోన్‌ ప్రధాన పాత్రలో రూపొందబోతున్న ఈ సినిమా ను వెయ్యి ఏళ్ల క్రితం కథతో రూపొందించబోతున్నారట. చెన్నై మరియు ముంబయిల్లో ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్టింగ్‌ లను నిర్మించి అందులో చిత్రీకరణకు ప్లాన్‌ చేస్తున్నారని కూడా తెలుస్తోంది. సింధనై సీ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న యువన్‌ ఈ సినిమా కు దర్శకత్వం వహించబోతున్నాడు. ఇక ఈ సినిమాను శక్తి మరియు శశికుమార్ లు నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం సన్నీ లియోన్‌ కేరళలో ఒక మలయాళం సినిమా షూటింగ్‌ లో పాల్గొంటుంది. ఆ తర్వాత హిందీలో ఒక సినిమాలో నటించబోతుంది. హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు సౌత్‌ లో ఇప్పటికే మంచి క్రేజ్ ను దక్కించుకుంది. యువన్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాతో మరింతగా స్టార్ డమ్‌ ను దక్కించుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.