Begin typing your search above and press return to search.

స్వ‌ర్గానికి రార‌మ్మ‌ని పిలుస్తున్న స‌న్నీలియోన్

By:  Tupaki Desk   |   3 Sep 2021 9:30 AM GMT
స్వ‌ర్గానికి రార‌మ్మ‌ని పిలుస్తున్న స‌న్నీలియోన్
X
స్వ‌ర్గ‌లోకానికి వెల్ కం చెబుతోంది స‌న్నీలియోన్. త‌న‌ని ఆరాధించే అభిమానుల‌ను అస్స‌లు విడువ‌నంటోంది. ఇటీవ‌ల స‌న్నీ తిరిగి బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు సంత‌కాలు చేస్తూనే సొంత సౌంద‌ర్య ఉత్ప‌త్తుల బ్రాండ్ స్టార్ స్ట‌క్ అభివృద్ధికి పాటుప‌డుతున్న ఈ బ్యూటీ మ‌రోవైపు డేనియ‌ల్ వెబర్ తో స‌రోగ‌సీ కిడ్స్ తో ఫ్యామిలీ లైఫ్ కి ఏమాత్రం భంగం క‌ల‌గ‌కుండా ప్లాన్ చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఇంత‌కుముందు ఎంటీవీ స్ప్లిట్స్ విల్లా స‌హా ప‌లు రియాలిటీ షో హోస్టింగుల‌తో బిజీ అయిన స‌న్నీ.. భారీగా ఆర్జిస్తోంది. మ‌రోవైపు వ‌ర‌స ఫోటోషూట్ల‌తోనూ స‌న్నీ హీట్ పెంచుతోంది. స్వ‌ర్గాన్ని త‌ల‌పించే మాల్దీవుల్లో విహ‌రిస్తున్న స‌న్నీ.. త‌న ఫ్యాన్స్ కి వెల్ కం చెబుతోంది.

ఇంత‌కుముందే సన్నీ లియోన్ తన భర్త డేనియల్ వెబర్.. పిల్లలు నిషా.. నోహ్ .. ఆషర్ తో మాల్దీవుల పర్యటన నుండి ఫోటో ఆల్బమ్ ను పంచుకున్నారు. తన మొత్తం కుటుంబంతో బీచ్ ప‌రిస‌రాల్లో ఆస్వాధిస్తోంది స‌న్నీ. ఈ పర్యటన నుండి వ‌రుస ఫోటోలు.. వీడియోలను పంచుకుంటోంది. బుధవారం షేర్ చేసిన వీడియోలో సన్నీ నీలిరంగు స్విమ్ సూట్ ధరించి హాటెస్ట్ లుక్ తో క‌నిపిస్తోంది. బీచ్ లో షాంపైన్ తో స్నాన‌మాచ‌రించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ``స్వర్గానికి స్వాగతం !!! రిఫ్-రాఫ్ అనుమతించబడదు !! నేను తప్ప!`` పార్టీ చేసుకోవడానికి జీవితాన్ని ఎంజాయ్ చేయ‌డానికి ఇదే స‌రైన‌ సమయం`` అంటూ ఆహ్వానించింది స‌న్నీ. మరొక ఫోటోలో సన్నీ ఒక కొలనులో సంద‌డిగా క‌నిపించింది. తేలియాడే ట్రేలో అల్పాహారాన్ని సేవిస్తోంది.

మాల్దీవుల్లో స్పా సెషన్ ని కూడా బుక్ చేసుకుని.. స్నార్కెలింగ్ కు వెళ్లింది. ఓషన్ స్పా వద్ద ఫిల్టర్ అవసరం లేదు ... ఇది నిజంగా చాలా అందంగా ఉంది !! గొప్ప అనుభవం నేను ప్రతిరోజూ స్పాకి రావాలని కోరుకుంటున్నాను`` అని ఆమె ఒక వీడియోని రిలీజ్ చేసింది. దీనిలో ఆమె స్పా టూర్ ప్ర‌మోష‌న్ చేసింది. ఇది నీటి పైన నిర్మించబడింది స్పా... ఫ్లోర్ కింద సముద్రం ప్రకాశవంతమైన నీలం నీటిని కూడా చూడవచ్చు.. అంటూ ప్ర‌చారం చేసింది.

త‌న‌ పిల్లలు సముద్రంలో ఈత కొడుతున్న ఫోటోల‌ను వీడియోల‌ను స‌న్నీ షేర్ చేసింది. నోవా -ఆషర్ - నిషా వీడియోల‌ను షేర్ చేయ‌గా వైర‌ల్ అవుతున్నాయి. స‌న్నీ షేర్ చేసిన ఫోటోల్లో ఇసుక‌లో డార్క్ బ్రింజాల్ క‌ల‌ర్ బికినీతో సంథింగ్ హాట్ గా క‌నిపిస్తోంది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నా.. స‌న్నీ మాత్రం వేడిగా ఫోజులివ్వ‌డం మ‌రింత‌గా మంట‌లు రేపింది.

సన్నీ తన త‌దుప‌రి వెబ్ సిరీస్ `అనామిక` చిత్రీక‌ర‌ణ‌ నుండి విరామం తీసుకుంటోంది. విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన అనామిక ఒక యాక్షన్ సిరీస్. మహమ్మారి సెకండ్ వేవ్ స‌మ‌యంలో జూలైలో అనామిక కోసం పనిని తిరిగి ప్రారంభించింది. దాని గురించి మాట్లాడుతూ ఓ ఇంటర్వ్యూలో, .. ఈ సుందరమైన బృందంలోకి తిరిగి రావడం అద్భుతం. మేము ఇప్పటివరకు చిత్రీకరించిన ప్రతిదీ అందంగా వ‌చ్చింది. మేము ఎక్కడి నుండి ప్రారంభిస్తున్నామో మాకు స్పష్టంగా ఉంది. విక్రమ్‌తో పనిచేయడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. మా షో సెట్స్‌కి తిరిగి రావడం ఆనందంగా ఉంది`` అని సన్నీ తెలిపింది. ప్ర‌స్తుతం స‌న్నీలియోన్ మాల్దీవుల విహారానికి సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. స్వ‌ర్గ‌లోక విహారానికి రార‌మ్మ‌ని ఆహ్వానించింది స‌న్నీ. మొత్తానికి మాల్దీవుల టూరిజానికి కావాల్సినంత బూస్ట్ ఇస్తోంది.