Begin typing your search above and press return to search.

అమెరికానే సేఫ్.. అలా ఆలోచించిన సన్నీ!

By:  Tupaki Desk   |   12 May 2020 4:20 PM IST
అమెరికానే సేఫ్.. అలా ఆలోచించిన సన్నీ!
X
కరోనా క్రైసిస్ కారణంగా దాదాపుగా ఎక్కువ శాతం జనాభా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. సాధారణ ప్రజలే కాకుండా సెలబ్రిటీలు కూడా స్టే హోమ్ స్టే సేఫ్ అనే స్లోగన్ పాటిస్తూ జాగ్రత్తగా ఉంటున్నారు. విదేశీ ప్రయాణాల ఊసే ఎవరూ ఎత్తడం లేదు. ముఖ్యంగా కరోనా విలయతాండవం చేస్తున్న కొన్ని దేశాల పేర్లు చెబితే చాలు.. భయపడిపోతున్నారు. ఇలా జనాలు భయపడుతున్న దేశాలలో అమెరికా కూడా ఉందన్నది చేదు నిజం. అమెరికా అంటే అదేదో భూతల స్వర్గం అని.. అక్కడ ఉంటే ఏమీ కాదని ఒక నమ్మకం.. భరోసా గతంలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ నమ్మకం ఎక్కువమందికి లేదు. కొందరు అమెరికాలో ఉన్న తెలివైన ఎన్నారైలు అమెరికానే గొప్ప అని ఇంకా వాదిస్తున్నారు గాని ఎక్కువమందికి మాత్రం జ్ఞానోదయం అయింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సినీ నటి సన్నీలియోన్ తన కుటుంబంతో సహా అమెరికాకు పయనించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.

సన్నీ లియోన్ తన భర్త డేనియల్ వెబర్.. ముగ్గురు పిల్లలతో కలిసి లాస్ ఏంజెలెస్ లోని తన సొంత ఇంటికి వెళ్ళింది. ఇది సన్నీ తన భర్త ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయమట. లాస్ ఏంజెలెస్ లో తన ఇంట్లో ఒక సీక్రెట్ గార్డెన్ కూడా ఉందట.. అందులో పిల్లలు హాయిగా ఉంటారని సన్నీ అభిప్రాయం. అమెరికాలో కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న మాట నిజమే కానీ లాస్ ఏంజెలెస్ లో మాత్రం తక్కువ ప్రభావం ఉంది. ఇక్కడ ఇండియా విషయమే తీసుకుంటే సన్నీలియోన్ నివసించేది ముంబైలో. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ఎక్కువ కేసులు నమోదయ్యాయి రాష్ట్రం మహారాష్ట్ర.. అందులోనూ ముంబైలో ఎక్కువ శాతం కేసులు నమోదవుతున్నాయి. ఆ కేసులు తగ్గుముఖం కూడా పట్టడం లేదు. అందుకే ముంబై కంటే లాస్ ఏంజలెస్ బెటర్ అని సన్నీ భావించిందేమో అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏదైతేనేం ఈ కరోనా హంగామా తగ్గిన తర్వాత సన్నీ తిరిగి ఇండియాకు రాక తప్పదు. ఎందుకంటే సన్నీ ప్రస్తుతం కొన్ని సినిమాలకు కమిట్ అయి ఉంది ఆ సినిమాల్లో నటించడానికి తప్పనిసరిగా ఇండియాకు రావాల్సిందే.