Begin typing your search above and press return to search.

హ‌బ్బీతో స‌న్నీలియోన్ బంతాట భలే ఉందే!

By:  Tupaki Desk   |   6 April 2022 2:30 AM GMT
హ‌బ్బీతో స‌న్నీలియోన్ బంతాట భలే ఉందే!
X
స‌న్నిలియోన్ సోష‌ల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. నిత్యం స‌న్ని హాట్ ఫోటోల‌తో మంట‌లు రేప‌డం ప‌రిపాటే. ఇక హ‌బ్బీ డేనియ‌ల్ వేబ‌ర్ తో స‌న్నిలియోన్ ఆస్వాద‌న గురించైతే చెప్ప‌దేముందు. ఆద‌ర్శ దంప‌తుల్లా ఇన్ స్టాలో ఎప్ప‌టికిప్పుడు వెలిగిపోతుంటారు. చూడ‌ముచ్చ‌టైన జంట‌గా నెటి జ‌నుల్ని ఆక‌ట్టుకుంటారు.

తాజాగా హ‌బ్బీతో స‌న్నిలియోన్ బంతాట ఆడుతోన్న వీడియోని పోస్ట్ చేసి దుమార‌మే రేపుతుంది. చీర‌క‌ట్టులో స‌న్నిలియోన్ భ‌ర్త‌తో క‌లిసి బాస్కెట్ బాల్ ఆడుతోంది. భ‌ర్త చేతిలో బాల్ అందుకోవ‌డం కోసం స‌న్ని చేసే ప్ర‌య‌త్నాలు యువ‌త‌ని ఆక‌ట్టుకుంటున్నాయి. చీర‌క‌ట్టులో స‌న్ని బంతిని అదుకునే ప్ర‌య‌త్నాలు చూస్తుంటే వాళ్లిద్ద‌రి మ‌ధ్య అన్యోన్య‌త ఉట్టి ప‌డుతుంది. చీర‌క‌ట్టులో స‌న్ని త‌డిపొడి అందాలు అంతే హ‌లైట్ అవుతున్నాయి.

ఈ వీడియో మొత్తానికి `కుచ్ కుచ్ హోతా హై` చిత్రంలో `యే ల‌డ్కీ హైదివానా` సాంగ్ ని బ్యాక్ గ్రౌండ్ లో జ‌త చేసింది. ఇంకేముందు ఓవైపు పెద్ద బంతితో భార్య‌భ‌ర్త‌ల ఆట‌..మ‌రోవైపు పాట చూస్తే నెటి జ‌నుల‌కు మ‌తి పోవాల్సిందే మ‌రి. ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. స‌న్నిలియోన్ అభిమానుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. గ‌తంలో స‌న్నిలియోన్ లుంగీ స్టెప్పులు కూడా నెట్టింట దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే.

ఇక స‌న్నిలియోన్ సినిమాల విష‌యానికి వ‌స్తే `ఓ మై గోస్ట్` లో న‌టిస్తోంది. అలాగే `వీర‌మ‌దేవి` ..`రంగీలా`.`షెరో` చిత్రాల్లో న‌టిస్తోంది. `వీర‌మ‌దేవి` స‌న్నిలియోన్ కెరీర్ లోనే భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతోన్న చిత్రం కావ‌డం విశేషం. అన్ని ప‌నులు పూర్తి చేసుకుని త్వ‌ర‌లోనే సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.