Begin typing your search above and press return to search.

సన్నీ లియోని.. వీర మహాదేవి

By:  Tupaki Desk   |   27 Dec 2017 9:48 PM IST
సన్నీ లియోని.. వీర మహాదేవి
X
సెక్సీ సుందరి సన్నీ లియోని స్పెషల్ సాంగ్స్ తో సౌత్ ని షేక్ చేస్తూ.. బాలీవుడ్ లో నటిగా రాణిస్తోంది. నార్త్ సౌత్ అని తేడా లేకుండా సన్నీ అన్ని భాషలను సన్నీ బ్యాలెన్స్ చేస్తోంది. అంతే కాకుండా అభిమానులను కూడా చాలా పెంచుకుంటోంది. సన్నీ ఎక్కడికైనా వస్తే ఎంట్రీ ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే గాని ఫ్యాన్స్ ఎంట్రీ మాత్రం వర్ణించలేనిది.

ఇక మొన్నటి వరకు సాంగ్స్ వరకే పరిమితం అయిన ఈ బ్యూటీ ఇప్పుడు సౌత్ లో సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఈ విషయం గురించి గత కొన్ని రోజులుగా మీడియాలలో కొన్ని కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఆమెకు ఏకంగా 4 కోట్లకు పైమాటే రెమ్యూనరేషన్ ఇచ్చేసి.. ఇప్పుడు ఆమెను ఒక పెద్ద సినిమాతో ఇక్కడికి దించుతున్నారు. ఈ సినిమాను ఏకంగా తెలుగు - హిందీ అలాగే తమిళ్ - మలయాళం లో తీస్తున్నారులే. ఈ సినిమాకు వీర మహాదేవి అనే టైటిల్ ని సెట్ చేశారట. స్వయంగా ఆ విషయాన్ని ఈ రోజు ఉదయం నుండి పేరు చివర నుండి ఒక్కో అక్షరం రిలీజ్ చేసిన సన్నీ లియోన్.. ఒక వీడియో ద్వారా తెలిపింది.

చారిత్రాత్మక నేపథ్యంలో తమిళ దర్శకుడు వడివుడైయన్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నారు. సినిమాలో సన్నీ పాత్ర చాలా ఆకట్టుకుంటుందట. వీరనారిగా సన్నీ చేసే పోరాట సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలవనున్నాయట. అందుకు సన్నీ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటోందని సమాచారం. మరి నాలుగు భాషల్లో తెరకెక్కబోయే ఈ సినిమా ఎంత మందిని ఆకట్టుకుంటుందో చూడాలి.