Begin typing your search above and press return to search.

న‌వ‌దీప్ కి స‌న్నీ లెస్స‌న్స్ ఏం చెప్తోంద‌బ్బా?

By:  Tupaki Desk   |   30 March 2020 11:30 PM GMT
న‌వ‌దీప్ కి స‌న్నీ లెస్స‌న్స్ ఏం చెప్తోంద‌బ్బా?
X
స‌న్నీలియోన్ టాలీవుడ్ కి కొత్తేమీ కాదు. వీణా మాలిక్ త‌ర్వాత ఈ అమ్మ‌డే ముంబై నుంచి వ‌చ్చి టాలీవుడ్ స‌ర్కిల్స్ లో బోలెడంత హ‌డావుడి చేసింది. అపుడెపుడో స‌న్నీ టీచ‌ర్ కోసం మంచు మ‌నోజ్ ఐసైపోయాడు. స‌న్నీ టీచ‌ర్ లెస్సన్స్ నేర్పించి వెళ్లింది. ఆ విష‌యాన్ని ఇంకా మ‌ర్చిపోలేదు ఫ్యాన్స్. 'క‌రెంట్ తీగ' మూవీలో యంగ్ మ‌నోజ్ తో కిర్రెక్కించే సీన్స్ లో న‌టించింది. వేడెక్కించే స్పెష‌ల్ నంబ‌ర్ లో అద‌ర‌గొట్టింది. అయితే ఆ సినిమా ఫ్లాపైంద‌నుకోండి!

ఇక‌పోతే స‌న్నీలియోన్ టాలీవుడ్ కి చెందిన మ‌రో హీరోతోనూ రొమాన్స్ చేస్తోందని తాజాగా లీక్ అందింది. స‌ద‌రు యువ‌హీరో కాస్త ఎగ్జ‌యిటెడ్ గానే ఈ విష‌యాన్ని త‌న‌కు తానుగానే వెల్ల‌డించాడు. స‌న్నీతో క‌లిసి అదిరిపోయే రొమాన్స్ కుదిరింది గురుడికి. ఆ ఇద్ద‌రూ ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఓ ఫోటోని ఇన్ స్టా ద్వారా రివీల్ చేశాడు. అంతేకాదు.. స‌న్నీపై బోలెడంత ప్రేమ కురిపిస్తూ ఒక క‌విత్వ‌మే చెప్పాడు. ఇంత‌కీ ఏమ‌ని క‌విత్వం చెప్పాడు? అంటే..

"స‌న్నీ ఈజ్ ఫ‌న్నీ... స‌న్నీ ఈజ్ స్మార్ట్... స‌న్నీ ఈజ్ హోమ్.. స‌న్నీ ఈజ్ సేఫ్‌.. బీ లైక్ స‌న్నీలియోన్.. ఐసోలేట్ యువ‌ర్సెల్ఫ్ అండ్ వాచ్.. రాగిణి ఎంఎంఎస్ రిట‌ర్న్స్" అంటూ క‌వి అయిపోయాడు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ ఫోటో చూస్తుంటే ఇందులో స‌న్నీలియోన్ తో న‌వ‌దీప్ అదిరిపోయే రొమాన్స్ చేశాడ‌నే అర్థ‌మ‌వుతోంది. అందుకేనా మ‌రీ ఇంత‌గా స‌న్నీ పై ప్రేమ కురిపిస్తున్నాడు? అంత‌గా క‌విత్వం చెబుతున్నాడు? బావుంద‌య్యో న‌వ‌దీప్!! ఇంత‌కీ సెల్ఫ్ క్వారంటైన్ స‌న్నీతోనేనా? ప్చ్!!

స‌న్నీ కెరీర్ సంగ‌త చూస్తే.. 'బేబీ డాల్' నిర్మాత‌ల నుంచి 'బాటియన్ బుజాడో' పాటలో స‌న్నీ మెరిసింది. అటుపైనా ఆతియా శెట్టి నటించిన 'మోటిచూర్ చక్నా చూర్' పాటలోనూ స‌న్నీ త‌ళుకుబెళుకులు ప్ర‌ద‌ర్శించింది. ఈ చిత్రం గత ఏడాది నవంబర్ 15 న విడుదలైంది. ప్ర‌స్తుతం COVID-19 ప్రపంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న నేప‌థ్యంలో స్వీయ‌నిర్భంధంలో ఉంది స‌న్నీలియోన్. అల వైకుంఠ‌పుర‌ములో త‌ర్వాత న‌వ‌దీప్ తిరిగి కాస్త హుషారుమీద‌నే ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నాడు. స‌న్నీతో రాగిణి ఎంఎంఎస్ రిట‌ర్న్స్ అత‌డికి బ్రేక్ నిస్తుందేమో చూడాలి.