Begin typing your search above and press return to search.
సన్నీలియోన్ కు కూడా అసహనమా?!
By: Tupaki Desk | 8 Dec 2015 1:00 AM ISTదేశంలో అసహనంపై పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముందుగా సాహితివేత్తలు, ఆ తర్వాత కళాకారులు తోడయిన ఈ రచ్చకు అనంతరం సినీనటులు తోడయ్యారు. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ దీనికి మరింత ఆజ్యం పోసింది. అయితే అత్యంత ఆశ్చర్యకరంగా శృంగార తార సన్నీలియోన్ అసహనంపై స్పందించింది.
సెక్సీ హీరోయిన్ నుంచి సినీతారగా మారిన ఈ సుందరి అసహనం గురించి అతి చేసే వారి నోర్లు మూతపడేలా నీతులు చెప్పింది. అసహనం అనే పదం చర్చించేందుకు ఆసక్తిగానే ఉంటుందని సన్నాయి నొక్కులు నొక్కింది. తను ఇతర దేశాల నుంచి వచ్చిన సినీనటిని అయినప్పటికీ భారతదేశంలో తనకెప్పుడు ఇబ్బంది కలగలేదని చెప్పుకొచ్చింది. "అసహనం లాంటి పరిస్థితే భారతదేశంలో ఉంటే నాలాంటి నటి ఇక్కడెలా ఉండగలదు? " అంటూ ఎదురు ప్రశ్నించి అసహనం పేరుతో ఆగమాగం అవుతున్న వారి నోళ్లకు తాళం వేసింది.
అయితే పనిలో పనిగా మీడియాను ఎద్దేవాచేసింది. అనేక సందర్భాల్లో సెలబ్రిటీలుగా తాము మాట్లాడిన విషయాలను వక్రీకరిస్తారని సన్నీలియోన్ ఆరోపించింది. కేవలం వెబ్ సైట్ల రేటింగ్ ల కోసమో....క్రేజీగా ఉండాలనో ఇలా చేస్తారని వ్యాఖ్యానించింది. తనకైతే ఇలాంటి వక్రీకరణలు రోజూ ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించింది.