Begin typing your search above and press return to search.
అత్తారింటికి టాటా చెప్పి ముంబైకి సన్నీ
By: Tupaki Desk | 6 Nov 2020 11:15 AM ISTసన్నీలియోన్ కుటుంబం కొద్దిరోజుల క్రితం హాలోవీన్ వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. రకరకాల ఫోజుల్లో సన్నీలియోన్ డేనియల్ వెబర్ జంట ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. అయితే ఈ వేడుకలన్నీ అమెరికాలో తన భర్త ఇంటి వద్ద జరిగాయి. ఇప్పుడు సన్నీలియోన్ తిరిగి ముంబైకి రావడానికి సిద్ధంగా ఉంది.
సన్నీ 6 నెలల తర్వాత ముంబైకి తిరిగి వచ్చేటప్పుడు అడ్వెంచర్ కోసం సిద్ధమయ్యిందట. సరికొత్త సాహస విన్యాసాల కోసం సిద్ధమయ్యానిలా అంటూ ఇదిగో ఇలా ఫోజిచ్చింది. సన్నీనిరంతరం అభిమానుల కోసం తన వ్యక్తిగత వృత్తి జీవితం గురించి సోషల్ మీడియాల్లో వెల్లడిస్తూనే ఉంది. COVID-19 సంక్షోభం తో దేశంలో అనివార్యమైన లాక్ డౌన్ కొనసాగుతుండగా.. మే నెలలో భర్త డేనియల్ వెబెర్ పిల్లలతో అమెరికాకు వెళ్లిపోయింది. ఆ తర్వాత తన అమెరికా లైఫ్ పై ప్రతి విషయాన్ని సన్నీలియోన్ షేర్ చేసింది.
ఇంతకీ ఈ ఫోటో ఎక్కడ? అంటే... ఆమె ఒక విమానం లోపల కూర్చుని ఫోజిచ్చిందిలా. సన్నీ లియోన్ నీలిరంగు కార్డిగాన్ మ్యాచింగ్ జాకెట్ ధరించి కనిపించింది. కూల్ షేడీ గ్లాసెస్ తో అత్యంత ఆకర్షణీయంగా కనిపించింది సన్నీ. “6 నెలల తరువాత ముంబై ఇంటికి రావడానికి సమయం వచ్చింది. ఇదో కొత్త సాహసం” అన్న వ్యాఖ్యను సన్నీ జోడించింది.
హాలోవీన్ సందర్భంగా రంగురంగుల దుస్తులను ధరించిన సన్నీ తన కుటుంబంతో కొన్ని చిత్రాలను పంచుకుంది. సన్నీ .. డేనియల్ ఇప్పుడు నిషా.. నోహ్.. ఆషేర్ అనే ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు. మత్తానికి అత్తారింటికి టాటా చెప్పి ముంబైకి సన్నీ బయల్దేరడంతో ఇండియా అభిమానుల్లో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది.
సన్నీ చివరిసారిగా `మోటిచూర్ చక్నాచూర్` అనే చిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖీ - అతియా శెట్టిలతో కలిసి నటించింది. ఇందులో ఆమె ఒక పాటలో ప్రత్యేకంగా కనిపించింది. ప్రస్తుతానికి సన్నీ లియోన్ కొన్ని సౌత్ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. వాటిలో రంగీలా .. వీరమాదేవి ఉన్నాయి.