Begin typing your search above and press return to search.

వాళ్లు తిడుతుంటే.. సన్నీ పొగిడేస్తోంది

By:  Tupaki Desk   |   23 Feb 2018 11:30 PM GMT
వాళ్లు తిడుతుంటే.. సన్నీ పొగిడేస్తోంది
X
ఒక‌ప్ప‌టి శృంగార తార... ఇప్ప‌టి బాలీవుడ్ న‌టి స‌న్నీ లియోన్‌ కు సౌత్ పై ప్రేమ పొంగుతోంది. ద‌క్షిణాది సినిమాల‌ను తెగ పొగిడేస్తోంది. సౌతిండియాలో ప‌ని చేస్తే చాలు... మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు వ‌స్తాయ‌ని... పెద్ద హీరోయిన్‌ గా ఎదిగే అవ‌కాశాలు ఉంటాయ‌ని అంటోంది. తెలుగులో న‌టించిన హీరోయిన్లు మాత్రం ఏంటో టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌ కు వెళ్లిపోతున్నారు. స‌న్నీ మాత్రం అక్క‌డ్నించి ఇక్క‌డికి వ‌స్తోంది.

స‌న్నీ లియోన్ అస‌లు కెరంజిత్ కౌర్ వోహ్రా. కెన‌డాలో పెరిగిన ఇండియ‌న్‌... అదేనండి ఇండో కెన‌డియ‌న్‌. చాలా ఏళ్లు పోర్న్ సినిమాల‌లో న‌టించింది. ఆరేళ్ల క్రితం బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలో పాల్గొంది. అంతే ఆమె ద‌శ తిరిగింది. మెల్ల‌గా సినిమా ఛాన్సులు రావ‌డం మొద‌లుపెట్టాయి. బాలీవుడ్‌ లో ప‌లు సినిమాల‌లో - స్పెష‌ల్ సాంగ్స్ లో న‌టించింది. ఇప్పుడు త‌మిళ సినిమాలో మంచి ఛాన్సు కొట్టేసింది. వీర‌మ్ దేవి అనే సినిమాలో మెయిన్ లీడ్ లో న‌టిస్తోంది. అందులో వీర వ‌నిత‌గా యుద్దాలు చేసే క్యారెక్ట‌ర్ ఆమెది. ఆ పాత్ర త‌న‌కు మంచి పేరు తెచ్చి పెడుతుంద‌ని ఆమె న‌మ్మ‌కంగా ఉంది.

ద‌క్షిణాది సినిమాల‌లో అవ‌కాశం రావ‌డంపై చాలా ఆనందంగా ఉంది స‌న్నీ. ఇక్క‌డ చేస్తే కెరీర్ ఎదుగుద‌ల బాగుంటుంద‌ని...వ్య‌క్తిగ‌తంగా కూడా త‌న‌కు కొత్త ప‌ద్ద‌తులు - భాష‌లు నేర్చుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతోంది. తెలుగులో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ - త‌మ‌న్నా - ర‌కుల్ ప్రీత్ లాంటి వాళ్లంతా బాలీవుడ్ కు వెళ్లేందుకు ఇష్ట‌ప‌డుతుంటే... స‌న్నీ అక్క‌డ్నించి వ‌చ్చి ఇక్క‌డి సినిమాల‌ను పొగుడుతోంది. మ‌న హీరోయిన్ల‌కు మాత్రం ద‌క్షిణాది సినిమా ఇండస్ట్రీ క‌న్నా బాలీవుడ్ బెట‌ర్ అనిపిస్తుంది.