Begin typing your search above and press return to search.

సొంతంగా సన్నీ బయోపిక్ తీస్తుంది!

By:  Tupaki Desk   |   29 Sept 2016 11:00 AM IST
సొంతంగా సన్నీ బయోపిక్ తీస్తుంది!
X
ప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్స్ సీజన్ నడుస్తుంది. ఈ విషయంలో ప్రేక్షకులు కూడా ఫుల్ ఆసక్తితో ఉండటంతో ఇలాంటి సినిమాలకు మంచి ఆదరణే లభిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో సన్నీ లియోన్ బయోపిక్ పై చర్చలు జరిగాయి. సన్నీ లియోన్ బయోపిక్ అంటే రకరకాల ఆసక్తికరమైన విషయాలు - సంప్రదాయ సిక్కు కుటుంబం నుంచి శృంగారతారగా మారడం - బాలీవుడ్ కి రావడం వరకూ ప్రతీ సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుందనేది అభిమానుల అభిప్రాయం. అయితే తాజాగా "మోస్ట్‌ లీ సన్నీ" పేరుతో దర్శకుడు దిలీప్ మెహతా తీసిన డాక్యుమెంటరీలో తన కథను ఎవరి ఇష్టానికి వారు పూర్తిగా మార్చేశారని వాపోయిన సన్నీ.. ఇక తన కథను తానే తీయాలని నిర్ణయించుకుంది.

ఇక వాళ్లనూ - వీళ్లను నమ్ముకోవడం దేనికి? తన జీవితం ఏమిటో, ఆ జీవిత కథ ఏమిటో తన కంటే ఎవరికి బాగా తెలుసు? అని భావించిన సన్నీ.. తన బయోపిక్ ని తానే తీయాలని నిర్ణయించుకుంది. ఈ సినిమా కోసం నిర్మాతగా కూడా మారుతున్న సన్నీ "ఈ ప్రపంచంలో నా జీవిత కథను ఎలా తీయాలో చెప్పే హక్కు ఎవరికీ లేదు.. ఇది పూర్తిగా నా జీవితం.. నా కథ నేనే చెప్పాలి" అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సన్నీ లియోన్ తన జీవితకథ ఆధారంగా తెరకెక్కబోయే సినిమాతో నిర్మాతగా మారుతున్నారు.

కాగా ఇప్పటికే సన్నీ లియోన్ జీవిత కథ ఆధారంగా "మోస్ట్‌ లీ సన్నీ" పేరుతో దర్శకుడు దిలీప్ మెహతా తీసిన డాక్యుమెంటరీలో తన భర్త డేనియల్ వెబర్‌ తో కలసి సన్నీ నటించింది. అయితే.. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ఈ చిత్ర ప్రదర్శనకు సన్నీ గైర్హాజరయ్యింది. అది తన కథ కాదని, ఎవరి అభిప్రాయాన్నో డాక్యుమెంటరీగా తీశారని.. దర్శకుడి విజన్‌ కి అనుగుణంగా నిజాయితీగా నటించానని.. కానీ, వాళ్ల ఇష్టానికి కథ మార్చారని.. ఆ డాక్యుమెంటరీ ఇండియాలో విడుదల కాకూడదని కోరుకుంటున్నా అని సన్నీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇలా తన కథను ఎవరు బడితే వారు తమకు తోచినట్లు మార్చేస్తున్నారని భావించిన సన్నీ, ప్రపంచానికి తప్పుడు కథ చూపించకూడదని, తన బయోపిక్ కి తానే నిర్మిస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/