Begin typing your search above and press return to search.

వెక్కి వెక్కి ఏడుస్తోందే? స‌న్నికి సానా క‌ష్ట‌మోచ్చిందే!

By:  Tupaki Desk   |   6 Jun 2022 8:38 AM GMT
వెక్కి వెక్కి ఏడుస్తోందే? స‌న్నికి సానా క‌ష్ట‌మోచ్చిందే!
X
స‌న్నిలియోన్ సోష‌ల్ మీడియాని ఏ రేంజ్ లో వినియోగిస్తుందో చూస్తునే ఉన్నాం. ఖాళీ స‌మ‌యం చిక్కితే చాలు ఇన్ స్టా రీల్స్ చేస్తుంది. ఇంకా ఖాళీగా ఉంటే మంచు విష్ణులా క్లోజ్ గా మూవ్ అయ్యే వాళ్లు ఉంటే దాగుడు మూత‌లు ఆడుతుంది. ఇటీవ‌లే ఈ జంట ఆడిన దాగుడు మూత‌ల వీడియో నెట్టింట ఏ రేంజ్ లో వైర‌ల్ అయిందో తెలిసిందే.

అటుపై ఇద్ద‌రు కిచెన్ రూయ్ లోకి దూరి దోసెలు వేసారు. విష్ణుకు వాటిని ఎంతో ప్రేమ‌తో వ‌డ్డించింది. ఆ వీడియో కూడా నెట్టింట కాక పుట్టించింది. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న ప్రెండ్ షిప్ బాండింగ్ ఎంత స్ర్టాంగ్ అన్న‌ది ఆ ర‌కంగా చెప్ప‌క‌నే చెప్పారు. తాజాగా అమ్మ‌డు మ‌రో ఇన్ స్టా రీల్ తో ముందు కొచ్చేసింది. ఈసారి ఏకంగా స‌న్ని అల‌క పానుపెక్కింది.

అందంగా ముస్తాబై...లంగావోణి క‌ట్టుకుని మ‌రి మంచమెక్కి ప‌డుకుని మ‌రీ వెక్కి వెక్కి ఏడుస్తుంది. పొట్ట‌పై స్మార్ట్ ఫోన్ పెట్టుకుని..రెండు చేతులు చాచి..నిలువునా మంచాన ప‌ర‌మ‌దించింది. కంట క‌న్నీళ్లు రావ‌డం లేదు గానీ..మ‌న‌సులో దుఖః మాత్రం బ‌య‌ట‌కి ఉబికి వ‌స్తుంది. స‌న్నిలియోన్ లో ఆ బాధని చూసి త‌ట్టుకోలేని ప‌రిస్థితి నెటి జ‌నుల‌ది.

పాపం ఏమంత క‌ష్టం వ‌చ్చింది. ఆ క‌ష్టమెందో మాకు చెబితే తీరుస్తాంగా? అంటూ నెటి జ‌నులు ముందుకొస్తున్నారు. ఆ క‌ష్టం సంగ‌తేంటో? చూస్తే.. నిన్న‌టి ఆదివారం ముగిసిపోయి సోమ‌వారం వ‌చ్చింద‌ని స‌న్నిలియోన్ ఇలా మంచాన ప‌డి క‌న్నీటి ప‌ర్యంతం అవుతుందిట‌. ఆదివారం స‌ర‌దాల‌న్ని నిన్న‌టితో ఆవిరైపోయాయి.

ప్రెష్ గా మ‌ళ్లీ డేని సోమ‌వారంతో మొద‌లు పెట్టాలంటే పాపం స‌న్నిలియోనికి క‌ష్టంగా మారింది. అందుకే ఇలా ఏ ప‌ని పాటు పెట్టుకోకుండా ముస్తాబై మంచాన ప‌డి కుమిలి పోతుంది.

సాధార‌ణంగా ఇలాంటి ప‌నులు గారాబంగా పెరిగే చిన్న పిల్ల‌లు చేస్తుంటారు. ఆదివారం ముగిసి సోమ‌వారం స్కూల్ కి వెళ్లాలంటే నానా అగ‌చాట్లు ప‌డ‌తారు. ఇప్పుడు స‌న్నిలియోన్ తీరు చూస్తుంటే అలాగే క‌నిపిస్తుంది. స్కూల్ కి వెళ్లాలా? అన్న తీరున చిన్న పాపాయిలా ప‌డుకుని మ‌రీ ఏడ‌స్తుంది పాపం.