Begin typing your search above and press return to search.

సన్నీ స్టెప్పులకి కర్నాటకలో బ్రేక్

By:  Tupaki Desk   |   16 Dec 2017 4:45 AM GMT
సన్నీ స్టెప్పులకి కర్నాటకలో బ్రేక్
X
న్యూ ఇయర్ వచ్చేస్తోంది. ఈ సమయాన్ని క్యాష్ చేసుకునేందుకు తారలు కూడా రెడీ అయిపోయారు. కొన్ని గంటల పాటు పెర్ఫామెన్స్ ఇచ్చి లక్షలు.. కోట్ల కొద్దీ మొత్తాన్ని జేబులో వేసుకునేందుకు ఇంతకంటే మంచి తరుణం వారికి దొరకదు. మాజీ పోర్న్ బ్యూటీ సన్నీ లియోన్ కూడా కర్నాటకలో ఇలాగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రెడీ అయింది.

అయితే.. సన్నీలియోన్ తమ గడ్డపై అడుగుపెడితే కుర్రాళ్లు పాడయిపోతారని.. తమ సంస్కృతి దెబ్బతింటుందని కర్నాటకలో చిన్నపాటి ఉద్యమమే జరుగుతోంది. దీన్ని బేస్ చేసుకుని సన్నీలియోన్ న్యూ ఇయర్ ఈవెంట్ కు అనుమతి నిరాకరించినట్లు కర్నాటక పోలీసులు చెబుతున్నారు. గతేడాది మహాత్మాగాంధీ రోడ్డులో జరిగిన ఓ కేసుపై కర్నాటక హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి.. మళ్లీ అలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ చర్య తీసుకున్నట్లు చెబుతున్నారు.

అయితే.. షో క్యాన్సిలేషన్ పై అధికారిక సమాచారం రాలేదంటున్నారు నిర్వాహకులు. ఆమె ఇక్కడ నగ్నంగా ప్రదర్శన ఇవ్వడం లేదని.. ఓ ఫ్యామిలీ ఈవెంట్ లో పాల్గొనేందుకే వచ్చిందని చెబుతున్నారు. సన్నీ లియోన్ షో గురించి ఇంత రాద్ధాంతం అవసరం లేదన్నది వారి వాదన. కానీ గతేడాది బెంగళూరు నడి రోడ్డుపై జరిగిన ఇన్సిడెంట్ ను బేస్ చేసుకుంటే.. ఈ కార్యక్రమం రద్దు చేయడమే సబబు అనే మాటలు వినిపిస్తున్నాయి.