Begin typing your search above and press return to search.

పబ్లిక్ లో మూతి ముద్దు పెట్టేసిందిగా

By:  Tupaki Desk   |   20 Jun 2017 4:23 AM GMT
పబ్లిక్ లో మూతి ముద్దు పెట్టేసిందిగా
X
సన్నీలియోన్ బాగా బోల్డ్ యాక్ట్రెస్. గతంలో పోర్న్ సినిమాలు చేసిన సంగతేమో కానీ.. ఇండియాకి వచ్చి అడల్ట్ కంటెంట్ మూవీస్ లో తెగ నటించేసింది. ప్రస్తుతం వీటి కౌంట్ ను మెల్లగా తగ్గించుకుంటూ.. ఐటెం సాంగ్స్ తో మెప్పించేందుకు తెగ ప్రయత్నిస్తోంది సన్నీ. మరీ పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ మాత్రమే లాంటి కబుర్లేమీ చెప్పడం లేదు కానీ.. గతంతో పోల్చితే ఇప్పుడీమెకు వస్తున్న రోల్స్ ఆకట్టుకునేవే ఉంటున్నాయి.

అయితే.. తను ఈ స్థితికి రావడానికి ప్రధాన కారణం తన భర్త డానియెల్ వెబర్ అని చెబుతుంటుంది సన్నీ లియోన్. తనే లేకపోతే.. తను ఇవన్నీ సాధించలేకపోయే దాన్నని కూడా అంటుంది. అలాగే భర్తపై ఉన్న ప్రేమను ఏ మాత్రం దాచుకోదు సన్నీ. రీసెంట్ గా ఈ భామ షేర్ చేసిన ఓ పిక్ చూస్తే.. మొగుడిపై సన్నీకి ఉన్న ఘాటు ప్రేమ స్థాయి తెలుస్తుంది. ఈ ఫోటోలో డానియెల్ కి సన్నీ లిప్ లాక్ ఇచ్చేస్తూ కనిపిస్తుంది. అక్కడి వాతావరణం చూస్తే.. అదో సినిమా షూటింగ్ అనే సంగతి అర్ధమవుతూనే ఉంది. పైగా పట్టపగలు.. షూటింగ్ స్పాట్ లో.. కెమేరా ఎదురుగా భర్తకు అంత ఘాటైన మూతి ముద్దు ఇవ్వడం అంటే.. సన్నీలో ఉన్న ప్రేమ ఎంతో తెలుస్తుంది.

ఇక సన్నీ లియోన్ సినిమాల విషయానికి వస్తే.. షారూక్ ఖాన్ తో కలిసి రయీస్ చిత్రంలో ఆడిపాడిన ఈమె.. తెలుగులో రాజశేఖర్ మూవీ పీఎస్వీ గరుడవేగలో ఓ ఐటెం సాంగ్ చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/