Begin typing your search above and press return to search.

స‌న్నీ కిర్రాకు తురుము లుక్కు చూడ‌త‌ర‌మా?

By:  Tupaki Desk   |   4 Feb 2021 3:15 PM IST
స‌న్నీ కిర్రాకు తురుము లుక్కు చూడ‌త‌ర‌మా?
X
వేడిగా వ‌య్యారాల్ని వ‌డ్డించ‌డ‌మెలాగో శృంగార తార స‌న్నీలియోన్ కి తెలిసినంత‌గా వేరొక‌రికి తెలీదేమో! నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో హీట్ పెంచే ఏదో ఒక వ్యాప‌కంతో ఇటీవ‌ల ట‌చ్ లోకి వ‌స్తోంది. ఇంత‌కుముందు భ‌ర్త డేనియ‌ల్ కోసం అత్త మామ‌ల్ని సేవ చేసుకునేందుకు అమెరికా వెళ్లిపోయిన స‌న్నీ తిరిగి లాక్ డౌన్ అనంత‌రం ఇండియాకి వచ్చేసింది. ఈసారి మునుప‌టి కంటే కాస్త భిన్నంగా ఉత్సాహంగా దూసుకొస్తోంది.

ప్ర‌స్తుతం సొంత లేబుల్ స్టార్ స్ట‌క్ సౌంద‌ర్య ఉత్ప‌త్తుల్ని ప్ర‌మోట్ చేసుకుంటూ బిజీగా ఉన్న ఈ భామ స‌డెన్ గా రెండు మూడు చిత్రాల‌కు సంత‌కాలు చేసింది. య‌ష్ రాజ్ ఫిలింస్ లో ఓ హార‌ర్ చిత్రంలో న‌టిస్తున్న ఈ బ్యూటీ... ఇత‌ర ప్రాజెక్టుల‌పైనా దృష్టి సారించింద‌ట‌. అంత‌కు ముందే ఇదిగో ఇలా అదిరిపోయే ఫోటో ట్రీట్ తో ఇన్ స్టాని షేక్ చేస్తోంది.

తాజాగా అల్ట్రా మోడ్ర‌న్ లుక్ తో యూత్ కి మెంట‌లెక్కించింది. అస‌లే మండే ఎండ‌లో ఈత కొట్టి కొల‌ను అంచున‌ అంత త‌మ‌కంగా నిల‌బ‌డిన స‌న్నీని చూస్తే సూర్యుడికైనా మ‌తి చెడుతుందేమో! అప్పుడే త‌డిసి ముద్ద‌యి ఒడ్డుకు చేరుకుంది. ఆ అందాల‌ దేహ‌శిరుల్ని క‌ప్పేస్తూ ట‌వ‌ల్స్ చుట్టుకొచ్చింది. ఇక ఆ అల్ట్రా మోడ్ర‌న్ కీనూ రీవ్స్ మ్యాట్రిక్స్ క‌ళ్ల‌ద్దం వ్వావ్ కిరాక్ అనిపించేస్తోంది. స‌న్నీని ఇలా చూస్తే కుర్రాళ్లు మ‌తి చెడి ఏదో అవ్వ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. అన్న‌ట్టు స‌న్నీ న‌టిస్తున్న సౌత్ పాన్ ఇండియా మూవీ `వీర‌మాదేవి` ఉన్న‌ట్టా లేన‌ట్టా..? ఇంత‌కీ ఈ మూవీ ఎప్ప‌టికి వ‌స్తుందో కానీ ఐపు లేదేమిటో!