Begin typing your search above and press return to search.

సన్నీ కోసం తడసి మోపెడైందే

By:  Tupaki Desk   |   7 April 2017 12:30 AM GMT
సన్నీ కోసం తడసి మోపెడైందే
X
ఈ మధ్య కాలంలో హీరో ప్రస్తుత మార్కెట్ కు సంబంధం లేకుండా భారీగా ఖర్చుపెట్టి తీస్తున్న మూవీ ఏదైనా ఉందా అంటే.. అది ఖచ్చితంగా సీనియర్ హీరో రాజశేఖర్ తో ప్రవీణ్‌ సత్తారు తీస్తున్న ''గరుడ వేగ'' సినిమా అనే చెప్పాలి. ఫారిన్ షూటింగ్ వలన ఈ సినిమా కోసం ఇప్పటికే అనుకున్న బడ్జెట్ కంటే ఓ రెండు కోట్లు ఎక్కువైందని ఒక టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా కోసం మరింత పెట్టేస్తున్నారు.

సినిమాకు హైప్ రావాలంటే ఖచ్చితంగా పేరొందిన స్టార్లు ఉండాలి. అందుకే ఈ సినిమాలో సన్ని లియోన్ తో ఒక ఐటెం సాంగ్ చేయిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. అయితే ఈ పాట కోసం ఆల్రెడీ సన్నీకి అర కోటి చెల్లించగా.. పాటకు పనిచేసే కొరియోగ్రాఫర్లకు ఫ్యాషన్ డిజైనర్ కు కూడా ఎక్కువగానే చెల్లిస్తున్నారట. ఆ మధ్యన రామ్-లీల సినిమాలో ప్రియాంక చోప్రా చేసిన ఐటెం సాంగ్ ఉంది చూశారూ.. ఆ పాటలో అమ్మడితో గ్లామరసం ఆరబోయించిన కొరియోగ్రాఫర్ విష్ణు దేవా.. ఇప్పుడు సన్ని గ్లామరసాన్ని ఇక్కడ ఆరబోయిస్తున్నారట. వీరందరికీ అయ్యే ఖర్చు తడసి మోపెడు అయ్యిందట.

ఇకపోతే గుంటూర్ టాకీస్ సినిమాలో బూతును వాడుకుని హిట్టు కొట్టాడనే అపవాదును ఎదుర్కొంటున్న ప్రవీణ్‌ సత్తారు.. ఇప్పుడు గరుడ వేగతో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రాజశేఖర్‌ కు కూడా ఈ సినిమా హిట్టవ్వడం చాలా కీలకం!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/