Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: పండగంతా సన్నీదగ్గరే ఉందిగా

By:  Tupaki Desk   |   26 Oct 2019 6:21 PM IST
ఫోటో స్టోరీ: పండగంతా సన్నీదగ్గరే ఉందిగా
X
అందరూ దీపావళి పండుగను జరుపుకునేందుకు ఉత్సాహంగా రెడీ అవుతున్నారు. కొందరు జఫ్ఫాలు పొల్యుషన్ అని.. పర్యావరణం అని క్లాసులు పీకుతూ ప్రతిఏడాదిలాగానే తమ ప్రతాపం చూపిస్తూ అపర మేథావుల్లా రచ్చ చేస్తూనే ఉంటారు. అలాంటివారితో సంబంధం లేకుండా సాధారణ ప్రజలతో పాటుగా చాలామంది సెలబ్రిటీలు కూడా దీపావళి పండుకకు రెడీ అవుతున్నారు. సెలబ్రిటీలు అయితే దీపావళి పార్టీలలో మునిగితేలుతున్నారు.

దీపావళి పార్టీలలో ట్రెడిషనల్ డ్రెస్సులలో సెలబ్రిటీలు చేసే హంగామా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రీసెంట్ గా ఈ జాబితాలోకి సన్నీ లియోన్ కూడా జాయిన్ అయింది. సన్నీ తన ముద్దుల కూతురు నిషాతో కలిసి ఒకే రకమైన ఎల్లో కలర్ ఛోళి లెహంగాలు ధరించి ఫోటోలకు పోజులిచ్చారు. దీపావళి లుక్ కావడంతో ఈ ఫోటోలు వెంటనే వైరల్ అయ్యాయి. ఇద్దరినీ చూస్తుంటే దీపావళి పండగంతా సన్నీ దగ్గరే ఉన్నట్టుంది.

సన్నీ- డేనియల్ వెబర్ దంపతులు ముగ్గురు సంతానం. నిషాను దత్తత తీసుకోగా.. అషర్.. నోవా అనే కవల పిల్లలకు సరోగసీ విధానం ద్వారా జన్మనిచ్చారు. ముగ్గురు పిల్లలు వచ్చిన తర్వాత సన్నీ లోకమే మారిపోయింది. సమయం చిక్కినప్పుడు పిల్లలతోనే గడుపుతూ అమ్మదనంలోని కమ్మదనాన్ని అస్వాదిస్తోంది.