Begin typing your search above and press return to search.

సన్నీని అలా చూపిద్దామని అనుకున్నదెవరో

By:  Tupaki Desk   |   4 May 2016 9:30 AM GMT
సన్నీని అలా చూపిద్దామని అనుకున్నదెవరో
X
సన్నీ లియోన్.. ఈ పేరు ఇండియాలో ఒక సెన్సేషన్. పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ గా మారిన ఈ భామకు.. భారతదేశంలో బోలెడంత డిమాండ్ ఉంది. ఆ తరహా సెగ్మెంట్ కు ఈమె బ్రాండ్ అంబాసిడర్ అనే గుర్తింపు తెచ్చేసుకుంది. ఇంటర్నెట్ లో ఇండియన్స్ ఎక్కువగా సెర్చ్ చేసే పేరు సన్నీనే. అదీ ఆమె డిమాండ్. తను చేసే రోల్స్ అన్నీ కూడా అడల్ట్ కంటెంట్ వే అయిఉంటాయి. దీనికి కారణం.. సన్నీని జనాలు అలా చూడాలని కోరుకోవడమే.

తాజాగా ఎఫ్ హెచ్ ఎం మేగజైన్ కి సన్నీ బోలెడన్ని ఫోటో ఫోజులిచ్చింది. ఎద అందాలను ఆరబోస్తూ.. కుంగ్ ఫూ ప్రాక్టీస్ చేస్తున్న సన్నీలియోన్ దర్శనమిస్తోంది. ఈ రేంజ్ ఆందాలతో ఫైట్ చేస్తానని సన్నీ అంటే, ఆ సొగసులతో యుద్ధానికి ఎవరైనా సై అనాల్సిందే. ఆమెతో ఆటలో ఓడిపోవడానికి రెడీ అయి మరీ పోటీ పడతారు. అంతలా పోజులిచ్చిన సన్నీ లియోన్.. ఇప్పుడు ఓ కొత్త విషయం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

రీసెంట్ గా సన్నీకి ఓ ఆఫర్ వచ్చిందట. అది కూడా నన్(క్రైస్తవ సన్యాసిని) పాత్ర చేయమని కోరారట. ఇలాంటి ఆఫర్ ఇచ్చినది ఎవరో సన్నీ లియోన్ చెప్పలేదు కానీ.. అలా ఈ పోర్న్ స్టార్ ని చూపించాలని ఆలోచన వచ్చిన మహానుభావులు ఎవరా అని డిస్కషన్ మొదలైంది. అయితే.. ఈ నన్ రోల్ తనకు సెట్ కాదని సన్నీలియోన్ తిరస్కరించడం కొసమెరుపు.