Begin typing your search above and press return to search.

భ‌ర్త పిల్ల‌ల‌తో హాయిగా రంగుల మ‌యంగా స‌న్నీలియోన్ సంసారం!

By:  Tupaki Desk   |   30 March 2021 6:30 AM GMT
భ‌ర్త పిల్ల‌ల‌తో హాయిగా రంగుల మ‌యంగా స‌న్నీలియోన్ సంసారం!
X
కాపురం స‌జావుగా సాగాలంటే భార్యాభ‌ర్త‌ల న‌డుమ అండ‌ర్ స్టాండింగ్ దానికి మించిన ప్రేమాభిమానాలు చాలా ముఖ్యం. ప్రేమ లేని చోట ఏదీ నిల‌వ‌దు. క‌ల‌త‌లు ష‌రా మామూలే. అవి కుటుంబ క‌ల్లోలాలుగా కూడా మారుతుంటాయి. అలాంటి జంట‌ల‌కు ఇదిగో ఇక్క‌డ ఉన్న ఈ జంట ఆద‌ర్శం అనే చెప్పాలి.

శృంగ‌ర తార‌గా ప్రపంచాన్ని ఏలిన సన్నీ లియోన్ ఆ త‌ర్వాత ఆ ప్ర‌పంచం నుంచి బ‌య‌ట‌ప‌డి బాలీవుడ్ లో క‌థానాయిక‌గా అడుగుపెట్టారు. తెలియ‌ని ఏజ్ లో త‌ప్ప‌ని ప‌రిస్థితిలో తాను త‌ప్పు చేయాల్సొచ్చింద‌ని ఆటోబయోగ్ర‌ఫీలో కూడా నివేదించారు. అయితే భ‌ర్త డేనియ‌ల్ వెబ‌ర్ ప్రేమ త‌న‌ని ఎల్ల‌పుడూ కాపాడుతుంద‌ని ఆయ‌నే లోకంగా జీవిస్తున్నాన‌ని స‌న్నీ చెబుతుంటారు.

ఇంత‌కుముందు లాక్ డౌన్ స‌మ‌యంలో అత్త‌మామ‌ల సేవ‌ల కోసం అమెరికా ప్ర‌యాణ‌మైన స‌న్నీలియోన్ ఒక స‌గ‌టు కోడ‌లిలానే ఆలోచించింది. భ‌ర్త సంతోషాన్ని పిల్ల‌ల సుర‌క్షిత‌మైన జీవ‌నాన్ని కోరుకునే స‌గ‌టు యువ‌తిలా ఎంతో ప‌ద్ధ‌తిగా త‌న కాపురాన్ని నిల‌బెట్టుకోవ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

రంగుల పండుగ హోలీని స‌న్నీలియోన్ త‌న భ‌ర్త పిల్ల‌ల‌తో క‌లిసి ఎంతో ముచ్చ‌ట‌గా ఆహ్లాదంగా సెల‌బ్రేట్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. బ‌హుశా .. ప్రేమ ఉన్న‌చోట అన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఆనందం ఉంటుంది. సంతోషం లేని చోట ఇంకేదీ ఉండ‌దు.

కుటుంబంతో ఉత్తమమైన హోలీ !! డేనియ‌ల్.. నిషా.. ఆషర్ .. నోహ్ ..ఇదే నా లోకం. మీరు కూడా ఆనందించండి! దేవుడు మీ అందరినీ ఆశీర్వదిస్తాడు. మీ జీవితాలు ఎల్లప్పుడూ రంగుల‌మ‌యంగా నిండుగా ఉంటాయని ఆశిస్తున్నాను!! అంటూ హోలీ సంద‌ర్భంగా స‌న్నీలియోన్ అభిమానుల‌కు విష్ చేశారు. మొత్తానికి స‌న్నీ పాఠం అంద‌రి గుండెల్ని తాకేదిగానే ఉంది.

ఇంత‌కుముందు వీరమాదేవి-రంగీలా చిత్రాల్లో స‌న్నీ న‌టించారు. న‌వాజుద్దీన్ సిద్దిఖీతో బటియన్ బుజాడో పాటలో .. అతియా శెట్టి తో `మోటిచూర్ చక్నాచూర్` పాటలో కూడా స‌న్నీ న‌ర్తించారు. విక్రమ్ భట్ తెర‌కెక్కిస్తున్న హార‌ర్ బేస్డ్ వెబ్ సిరీస్ ‌లోనూ స‌న్నీ న‌టిస్తోంది.