Begin typing your search above and press return to search.

ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేసేసింది

By:  Tupaki Desk   |   21 Feb 2016 1:30 AM GMT
ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేసేసింది
X
నేను గతంలో పోర్న్ సినిమాలు చేసినందుకు ఏ మాత్రం ఫీల్ కానని గర్వంగా చెప్పిన సన్నీ లియోన్.. ఇండియన్ మూవీస్ లో బాగానే క్లిక్ అయింది. పెర్ఫామెన్స్ బేస్డ్ రోల్స్ కోసం అయితే ఆఫర్స్ రావడం లేదు కానీ.. చెప్పుకోదగినన్ని సినిమాలే చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో సినిమాలతో పాటు బిజినెస్ ని కూడా మొదలుపెట్టేసింది సన్నీ లియోన్.

వ్యాపారం అంటే డబుల్ మీనింగ్స్ తీసుకోవాల్సిన పని లేదు. కొత్త వెంచర్ మొదలుపెట్టింది. ఇక్కడ సొంత బ్రాండ్ తో పెర్ఫ్యూమ్స్ అమ్మే బిజినెస్ స్టార్ట్ చేసి, ఆంట్రప్రెన్యూర్ గా మారిందన్న మాట. 'ఓ సంచలనం ప్రకటించడానికి సమయం దగ్గర పడుతోంది. దీని కోసం చాలా కాలంగా ఎదురచూస్తున్నా' అంటూ సన్నీ ఓట్వీట్ పెట్టింది. త్వరలో 'లస్ట్ బై సన్నీ' అనే బ్రాండ్ పై సొంతగా ఫ్రాగ్రెన్స్ విక్రయాలు చేపట్టనుంది. వీటికి తనే ప్రమోషన్ కేంపెయిన్ చేసుకుంటుందనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మొత్తానికి ఇండియా ఈ భామకు బాగానే కలిసొచ్చినట్లుగా అనిపిస్తోంది. ఒకవైపు వ్యాపారం, మరోవైపు బిజినెస్ తో వెలిగిపోతోంది.

ప్రస్తుతం బేమాన్ ఇష్క్, వన్ నైట్ స్టాండ్ చిత్రాలకు డబ్బింగ్ చెబుతున్న సన్నీ లియోన్.. గతంలో ఆగిపోయిన టీనా అండ్ లోలో మూవీని కూడా కంప్లీట్ చేసే పనిలో పడింది. ఇండియా ఇంటర్నెట్ సెర్చింగ్ లోనే సన్నీ లియోన్ టాప్ స్టేజ్ లో ఉంటే.. ఇక సన్నీ సొంతగా తయారు చేసి అమ్మేస్తున్న సెంట్, పెర్ఫ్యూమ్ లకు ఏ రేంజ్ లో గిరాకీ ఉండనుందో.!