Begin typing your search above and press return to search.

డియో డియో.. డిసక డిసక..

By:  Tupaki Desk   |   13 Oct 2017 10:29 PM IST
డియో డియో.. డిసక డిసక..
X
సన్నీ లియోన్ కి క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా కూడా అమ్మడు అన్ని బాషల ప్రేక్షకులను మెప్పించేందుకు ఇష్టపడుతోంది. ఎక్కడ స్పెషల్ సాంగ్స్ చేసే అవకాశాలు వచ్చినా చేస్తాను అంటోంది. ఇక చాల రోజుల తర్వాత తెలుగులో చేసిన ఐటెమ్ సాంగ్ డియో డియో. రాజశేఖర్ పిఎస్వి గరుడ వేగలో ఆమె డియో డియో అంటూ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుందన్న విషయం తెలిసిందే.

అయితే ఆ సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. పాట అనుకున్నట్టుగానే ఫుల్ హాట్ గా ఉంది. భాస్కరభట్ల లిరిక్స్ ను చాలా స్పైసి గా రాసాడని అర్ధమవుతోంది. సినిమాలో సన్నీ ప్రతి అందానికి ఒక రేటు అనేలా ఆ సాంగ్ ఉంది. అంతే కాకుండా ఆమె ప్రతి అందాన్ని పొగిడినట్లు ఉంది. ఇక ఆమె క్రేజ్ గురించి కూడా మంచి లైన్స్ ఉన్నాయి. సన్నీ కోసం ఫ్యాన్స్ ఎలా ఎగబాడతారో తెలిసిన విషయమే. ఆ తరహాలోనే పాట సాగుతున్నట్లు ఉంటుంది.

మొత్తానికి పాట విన్నవారు డియో డియో డిసక డిసక అనడం ఖాయంగా కనిపిస్తోంది. భీమ్స్ ఈ పాటకి మంచి బాణీలను అందించాడు. ఇక గీతామాధురి మరో సారి తన గాత్రంతో వారెవ్వా.. అనిపించేలా చేసింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎందుకంటే లిరికల్ విడియాలో సన్నీ మూమెంట్స్ కూడా ఉన్నాయి మరి.