Begin typing your search above and press return to search.

పించ్ లో కన్నీళ్ళు పెట్టుకున్న సన్నీ లియోన్

By:  Tupaki Desk   |   11 March 2019 3:31 PM IST
పించ్ లో కన్నీళ్ళు పెట్టుకున్న సన్నీ లియోన్
X
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరు తెలియని సినీ ప్రేమికులు భారతదేశంలో దాదాపుగా ఉండరు. పోర్న్ స్టార్ గా కెరీర్ ప్రారంభించిన సన్నీ లియోన్ నెమ్మదిగా ఆ కెరీర్ వదిలేసి బాలీవుడ్ నటిగా పేరు తెచ్చుకుంది. కానీ ఎంత బాలీవుడ్ సెలబ్రిటీగా మారినా తన గతాన్ని చెరిపేయలేదు కదా. అందుకే తన గతజీవితానికి సంబంధించి ఎదుర్కొన్న అవమానాలు ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.

ఈ విషయం రీసెంట్ గా సన్నీ లియోన్ 'పించ్' అనే సెలబ్రిటీ చాట్ షో కు హాజరయినప్పుడు వెల్లడయింది. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించే ఈ షోలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎదుర్కొనే ట్రోల్స్ గురించి.. విమర్శల గురించి చర్చిస్తారు. ఈ కార్యక్రమానికి సన్నీ లియోన్ అతిథిగా హాజరయింది. కార్యక్రమంలో భాగంగా సన్నీని ఉద్దేశించి ఒక నెటిజన్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యను అర్బాజ్ ప్రస్తావించడంతో సన్నీ కంటతడి పెట్టుకుంది. అర్బాజ్ ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించినా ఆమె కన్నీరు ఆగలేదు. పాత జీవితాన్ని పూర్తిగా వదిలేసి నటిగా కొనసాగుతున్నప్పటికీ చాలామంది నెటిజనులు ఇలా అవమానకరమైన కామెంట్లు చేస్తూ బాధ పెడుతున్నారని సన్నీ వెల్లడించింది.

మార్చ్ 12 నుండి ఈ చాట్ షో ప్రసారం అవుతుందట. మొదటి సీజన్లో 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇప్పటికే ఆ పది ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తయిందట. నవాజుద్ధిన్ సిద్ధిఖి.. సోనాక్షి సిన్హా.. కరణ్ జోహార్.. కపిల్ శర్మ లాంటి ఇతర అతిథులు ఈ చాట్ షో కు హాజరయ్యారు.