Begin typing your search above and press return to search.

సన్నీలియోన్ ఇండియా వచ్చింది.. పని మొదలు పెట్టింది

By:  Tupaki Desk   |   22 Dec 2020 3:00 PM IST
సన్నీలియోన్ ఇండియా వచ్చింది.. పని మొదలు పెట్టింది
X
బోల్డ్ బ్యూటీ సన్నీలియోన్ ఫ్యాన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె చిత్రాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. బాలీవుడ్ లో తనదైన గుర్తింపు దక్కించుకున్న ఈ హాట్ బ్యూటీ.. కరోనా నేపథ్యంలో ఇన్నాళ్లూ అమెరికాలో ఉంది. ఈ మధ్యనే మళ్లీ ఇండియాకు మకాం మార్చిన అమ్మడు.. తన పనుల్లో బిజీ అయిపోయింది.

సన్నీ చివరి సారిగా ‘మోతీ చూర్ - చక్నా చూర్’ సినిమాలో ఓ అతిథి పాత్రలో కనిపించింది. ఇది 2019లో విడుదలైంది. ఆ తర్వాత ఫ్యామిలీతో అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కు వెళ్లిపోయింది. అనంతరం ఇండియాలో లాక్ డౌన్ ప్రారంభం.. సినిమా షూటింగ్ లు ఆగిపోవడంతో అక్కడే ఉండిపోయింది. ఈ మధ్యనే తిరిగి వచ్చింది.

ప్రస్తుతం సినిమాలు, ఎండార్స్‌మెంట్‌లతో బిజీగా మారిపోయింది. కాగా.. తాజాగా ఓ వెబ్ సిరీస్ కు సైన్ చేసింది ఈ భామ. ‘అనామిక’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో నటించబోతోంది. మొత్తం పది ఎపిసోడ్‌లుగా ఉండే ఈ వెబ్ సిరీస్ ను ముంబైలో చిత్రీకరించనున్నారు. మొదటి షెడ్యూల్ డిసెంబర్ నాటికి పూర్తవుతుందని సమాచారం.

ఈ ‘అనామిక’ వెబ్ సిరీస్ కు విక్రమ్ భట్ దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్ రోల్ పోషిస్తున్న సన్నీ లియోన్.. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందింది. ఈ సినిమాలో గన్స్ కూడా యూజ్ చేస్తుందట సన్నీ. విక్రమ్ భట్, కృష్ణ భట్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఎంఎక్స్ ప్లేయర్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు.